హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు ఏడాది: మృతులకు నివాళి

|
Google Oneindia TeluguNews

Dilsukhnagar bomb blast incident completes one year
హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా ఘటనా స్థలం(కోణార్క్ థియేటర్) వద్ద పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు నివాళులర్పించారు. ఘటనలో మృతి చెందిన వారికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు ఘటనను తల్చుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఘటనలో అసువుబాసిన మృతులకు నివాళులర్పించిన అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాదానికి కులం, మతం, ప్రాంతం, భాషలతో సంబంధం లేదని, దేశంలో అరాచకం సృష్టించడమే వారి లక్ష్యమని ఆయన అన్నారు. ఆయనతోపాటు బిజెపి నగర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు పాల్గొని నివాళులర్పించారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని నివాళులర్పించారు.

2013, ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లు 18 మందిని పొట్టన పెట్టుకున్నాయి. మరో 138 మదిని గాయాలపాలు చేసి, 76 మంది అవయవాలు లేకుండా చేశాయి. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. కాగా ఇప్పటికీ కొందరు బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరనే లేదు. ఘటనా స్థలానికి వచ్చిన బాధితుల కుటుంబ సభ్యులు, ఘటనను తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

English summary

 Dilsukhnagar bomb blast incident completed one year from today, some peoples and leaders are came to the incident place and they Paid tribute to the who ar dead in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X