• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డింపులా? మజాకా !: భలే చలాకీ, అన్నింటిలోనూ...

By Swetha Basvababu
|

లక్నో: మొన్నటివరకు ఆమె భర్త చాటు మహిళ. పార్లమెంట్‌లో గానీ, బయట గానీ ఆమె రాజకీయంగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువే. మౌనంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో వ్యవహరించే డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ ఎంపి.

ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి. ఇప్పటివరకు గ్రుహిణిగా కుటుంబ వ్యవహారాలను, పిల్లల బాగోగులను మాత్రమే పట్టించుకున్న డింపుల్.. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

తొలిసారి 2009 ఎన్నికల్లో ప్రస్తుత యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ చేతిలో ఓటమి పాలైనా.. 2012లో ఏకగ్రీవంగా కన్నౌజ్ నుంచి, రెండున్నరేళ్ల క్రితం 2014లో రెండోసారి విజయం సాధించిన డింపుల్.. తన నియోజకవర్గానికి పరిమితమయ్యేవారు.

ప్రత్యర్థులపై విరుచుకుపడ్డమే..

ప్రత్యర్థులపై విరుచుకుపడ్డమే..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తన భర్తతో కలిసి చురుగ్గా పాల్గొంటున్న డింపుల్.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో చెణుకులు విసురుతూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఈ వారం ప్రారంభంలో అలహాబాద్ స్థానం నుంచి పోటీచేసిన పార్టీ అభ్యర్థి రిచాసింగ్‌కు మద్దతుగా జరిగిన ప్రచారసభలో నేరుగా ప్రధాని నరేంద్రమోదీపైనే విమర్శనాస్త్రం సందించారు. అందుకు 1980వ దశకంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన లావారీస్ సినిమాలో ఆయన పాడిన పాట 'మేరే అంగనే మే.. తుమ్హారా క్యా కామ్ హై' అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి, తమ ఇంట్లో (అంటే యూపీలో) మీకు ఏం పని అంటూ ప్రశ్నించారు. అలా ఆమె ప్రశ్నించగానే ఒక్కసారిగా అక్కడున్న వందల మంది మహిళలు 'డింపుల్ భాభీ' అంటూ నినదించారు.

నామమాత్రమే లోక్‌సభ చర్చల్లో...

నామమాత్రమే లోక్‌సభ చర్చల్లో...

డింపుల్ యాదవ్ లోక్‌సభలో పెద్దగా మాట్లాడరు, ప్రశ్నలు కూడా పెద్దగా అడిగిన సందర్భాలు లేవు. ఆమె ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే చర్చలలో పాల్గొన్నారు. లోక్‌సభకు ఆమె హాజరు కూడా కేవలం 37 శాతం మాత్రమే. 2014లో మహిళల మీద జరుగుతున్న నేరాలపై మాట్లాడుతుండగా పదే పదే ఇతర సభ్యులు అంతరాయాలు కలిగించడంతో.. కనీసం తాను మాట్లాడుతున్నందుకు తన మామ ములాయం సింగ్ యాదవ్ సంతోషిస్తారని చెప్పారు.

అఖిలేశ్ కు విజన్ ఉందన్న డింపుల్

అఖిలేశ్ కు విజన్ ఉందన్న డింపుల్

గతంలో భర్తతో కలిసి కేవలం కార్యక్రమాలకు హాజరు కావడానికి పరిమితమయ్యే డింపుల్ యాదవ్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి మీదే విమర్శలు చేసే స్థాయికి డింపుల్ వచ్చారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ అంటూ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) లేవని అన్నారు. రాష్ట్ర ప్రగతి పట్ల విజన్ గల అఖిలేశ్ యాదవ్ కు మరోసారి పట్టం కట్టాలని అభ్యర్థిస్తున్నారు. ఆమె, ఆమె తోటి కోడలు - ప్రస్తుతం లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన అపర్ణా యాదవ్‌తో కలిసి ములాయం కుటుంబ సభ్యులు 22 మంది అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నిక కావడం గమనార్హం.

డింపుల్ ప్రచారానికి..

డింపుల్ ప్రచారానికి..

డింపుల్ యాదవ్ ప్రచారం కోసం అధికార సమాజ్ వాదీ పార్టీలో డిమాండ్ పెరుగుతున్నది. పార్టీలో సమర్థత గల మహిళా నాయకురాలని అభివర్ణిస్తున్నారు. ఆమె పాల్గొన్న సభలకు హాజరైన మహిళలు, యువత దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నది. భారీ స్థాయిలో మహిళలు, యువతులు ఆమె సభకు హాజరు కావడం తమకు కలిసొచ్చే అంశమని ఎస్పీ నేత జూహుసింగ్ చెప్పారు.

వాటికే కీలక పాత్ర...

వాటికే కీలక పాత్ర...

బయటకు మౌనంగా వ్యవహరించే డింపుల్ యాదవ్.. రాష్ట్రంలో మహిళలు, బాలల అభ్యున్నతి, సంక్షేమం పట్ల సానుకూల విధానాల రూపకల్పనలో సీఎం అఖిలేశ్ యాదవ్‌కు సలహాలిచ్చే స్థాయికి చేరుకున్నారని పార్టీ వర్గాల కథనం. అందులో భాగంగా పేద మహిళలకు ఉచితంగా కుక్కర్ పంపిణీ చేస్తామన్న వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారంటున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు పార్టీ అభ్యర్థుల ప్రచార సామగ్రిలో పార్టీ మిత్రపక్షం రాహుల్ గాంధీతోపాటు ములాయం, అఖిలేశ్ సరసన డింపుల్ యాదవ్ ఫోటో తప్పనిసరిగా మారింది.

కూతుళ్లతో ఇలా మధ్యవర్తిత్వం...

కూతుళ్లతో ఇలా మధ్యవర్తిత్వం...

సమాజ్‌వాదీ పార్టీలో అధిపత్య పోరు కోసం నేతాజీ ‘ములాయంసింగ్ యాదవ్'తో భర్త అఖిలేశ్ యాదవ్ ఘర్షణకు దిగినప్పుడు కూడా కుటుంబ సభ్యురాలిగా డింపుల్ యాదవ్ వ్యవహరించారని చెప్తుంటారు. తండ్రీ కొడుకుల మధ్య విభేదాల పరిష్కారానికి తమ కూతుళ్లిద్దరిని డింపుల్ తన మామ ములాయం వద్దకు రాయబారులుగా పంపారని సమాచారం. తండ్రీ కొడుకులు తమ విధానాలకే కట్టుబడి ఉన్నా.. పక్కపక్కనే ఉన్న ఇళ్లలోకి అఖిలేశ్ కూతుళ్లిద్దరూ యదేచ్ఛగా తిరుగాడుతూ ఉండేవారు. ఈ దశలో ఘర్షణపై ములాయంను మనుమరాళ్లు ప్రశ్నిస్తే ‘మీ నాన్న మొండిఘటం' అని నేతాజీ అన్నారని వార్తలొచ్చాయి. అదే విషయం వారు తండ్రి అఖిలేశ్‌తో చెబితే ‘అవును. నేను మొండివాడినే' అని నవ్వేశారట.

ములాయంతో కలిసి మేనిఫెస్టో ఆవిష్కరణ

ములాయంతో కలిసి మేనిఫెస్టో ఆవిష్కరణ

పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్, భార్య డింపుల్ యాదవ్‌లతో కలిసి ఎన్నికల మేనిఫెస్టో విడుదలచేసిన సీఎం అఖిలేశ్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన ఆజంఖాన్ మధ్యవర్తిత్వం మేరకు మేనిఫెస్టో ఆవిష్కరణ తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతాజీతో కలిసి భార్యాభర్తలిద్దరూ మేనిఫెస్టో ఆవిష్కరింపజేసినట్లు ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆజంఖాన్ కూడా హాజరయ్యారు. ఇక అపర్ణా యాదవ్ పోటీ చేస్తున్న లక్నో కంటోన్మెంట్ స్థానంలో ప్రచారం ద్వారా తామంతా ఒక్కటేనన్న సంకేతాన్నిచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
“Aap chillate ho, mujhe darr lagta hai. Shant ho jaiye (When you shout, I get scared. Please be quiet),” irritated by the relentless slogans, Dimple Yadav politely appealed to the audience to maintain decorum. But the interruptions did not stop. She then jokingly threatened to walk off the stage, and warned the animated party supporters that she would complain to the Chief Minister if they did not heed her. “I will tell bhaiya that you did not let me speak. I will complain ... bhaiya is coming here tomorrow,” she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more