వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతిపై విచారణకు శశికళ సిద్దం, జైల్లో దినకరన్ భేటీ, ఏం చెయ్యాలో తెలుసు !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ ఎదుర్కోవడానికి శశికళ సిద్దంగా ఉన్నారని ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ అన్నారు. శుక్రవారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను టీటీవీ దినక

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ ఎదుర్కోవడానికి శశికళ సిద్దంగా ఉన్నారని ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ అన్నారు. శుక్రవారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను టీటీవీ దినకరన్ ములాఖత్ లో కలిశారు.

బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ పుట్టిన రోజు వేడుకలు, మన్నార్ గుడి మాఫియా !బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ పుట్టిన రోజు వేడుకలు, మన్నార్ గుడి మాఫియా !

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో భేటీ అయిన తరువాత దినకరన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతిపై విచారణకు ప్రత్యేక కమిటీ వేస్తున్నారని చిన్నమ్మ శశికళకు చెప్పానని దినకరన్ స్పష్టం చేశారు.

Dinakaran comments on unification AIADMK factions articleconten

జయలలిత అనారోగ్యంతోనే చనిపోయారని, ఎలాంటి విచారణ కమిటీ వేసినా భయం లేదని, మీరు ధైర్యంగా ఉండాలని, తాను విచారణ ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని శశికళ చెప్పారని దినకరన్ వివరించారు. పోయెస్ గార్డెన్ తో పాటు జయలలిత ఆస్తుల విషయంలో స్పంధించడానికి దినకరన్ నిరాకరించారు.

జయలలిత ఆస్తులకు భారీ బందోబస్తు, మన్నార్ గుడి మాఫియా చొరబడుతుందని నిఘా!జయలలిత ఆస్తులకు భారీ బందోబస్తు, మన్నార్ గుడి మాఫియా చొరబడుతుందని నిఘా!

అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి ఎలా తీసుకోవాలని అని చిన్నమ్మ చెప్పారని ఇక ఆదిశగా ముందుకు వెలుతానని దినకరన్ అన్నారు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కమిటీ సభ్యులతో మాట్లాడిన తరువాత తమిళనాడు ప్రభుత్వం మీద తాను తగిన చర్యలు తీసుకుంటానని దినకరన్ వివరించారు.

త్వరలోనే తమిళనాడులో పలు మార్పులు జరుగుతాయని, మీరు కూడా వేచి చూడాలని దినరన్ మీడియాతో అన్నారు. ఓ వైపు తమిళనాడు సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం ఒక్కటి అవుతున్న సందర్బంలో ఏ ధైర్యం చూసుకుని టీటీవీ దినకరన్ ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడంతో ఆయన వర్గీయులు ఆయోమయంలో పడిపోయారు.

English summary
TTV Dinakaran has commented on the unification of both the ADMK factions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X