వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేల ఓటు ? శశికళతో మాట్లాడి !

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చీలిక వర్గం నాయకుడు, ఆ పార్టీ (అమ్మ వర్గం) బహిష్కరించిన నేత టీటీవీ దినకరన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని తెలిసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చీలిక వర్గం నాయకుడు, ఆ పార్టీ (అమ్మ వర్గం) బహిష్కరించిన నేత టీటీవీ దినకరన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు నిర్ణయించారని తెలిసింది.

ఇటీవల టీటీవీ దినకరన్ బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో భేటీ అయ్యి చర్చించారు. ఆ సందర్బంలోనే ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని శశికళ సూచించారని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గుసగుసలాడుతున్నారు.

ఇంటికి పిలిపించుకుని !

ఇంటికి పిలిపించుకుని !

బెంగళూరు నుంచి చెన్నై చేరుకున్న టీటీవీ దినకరన్ తన వర్గంలోని ఎమ్మెల్యేలతో చర్చించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. చెన్నైకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలతో దినకరన్ ఫోన్ లో మాట్టాడారని సమాచారం.

Recommended Video

Ramnath Kovind vs Meira Kumar : Dalit vs Dalit battle | Oneindia News
పళనిసామి ప్రభుత్వాన్ని ?

పళనిసామి ప్రభుత్వాన్ని ?

శశికళ సూచన మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమారికి ఓటు వేసి కాంగ్రెస్ కు దగ్గర కావాలని శశికళ నిర్ణయించారని తెలిసింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ గట్టిగా నిర్ణయించారని తెలిసింది.

స్టాలిన్ తో దోస్తీ ?

స్టాలిన్ తో దోస్తీ ?

తన వర్గంలోని ఎమ్మెల్యేలను పరోక్షంగా డీఎంకేకి మద్దతు ఇప్పించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ను సీఎం చేసి ఎడప్పాడి పళనిసామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను రాజకీయంగా చావుదెబ్బ కొట్టాలని శశికళ తన మేనల్లుడు దినకరన్ కు సూచించారని సమాచారం.

తంబిదురై మాత్రం !

తంబిదురై మాత్రం !

ఇటీవల లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సైతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో భేటీ అయ్యి చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు ఓటు వెయ్యాలని శశికళ సూచించారని తంబిదురై అన్నారు.

అదే కారణం అంటున్నారు

అదే కారణం అంటున్నారు

టీటీవీ వర్గం ఎమ్మెల్యేలు మాత్రం రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు పోలింగ్ రోజు టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని నిర్ణయించారని తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తనను బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదనే కసితోనే దినకరన్ ఈ ప్లాన్ వేశాడని సమాచారం.

English summary
Sources said that Dinakaran Faction AIADMK MLAs may be to vote against BJP Candidate Ramanth Kovind in the Presidential elections on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X