వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే పార్టీ గుర్తు దక్కదని ఆందోళన, శాశ్వతంగా రద్దు చెయ్యాలని శశికళ టీం డిమాండ్ !

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం రెండు వర్గాల వాదనలురెండాకుల గుర్తు ఇక మనకు దక్కదని పసిగట్టిన శశికళ, టీటీవీ దినకరన్ వర్గం,తెర మీదకు మరో డిమాండ్, రెండాకుల గుర్తు శాశ్వతంగా రద్దు చెయ్యాలని కొత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం విషయంలో వీకే. శశికళ, టీటీవీ దినకరన్ వర్గం కొత్త వాదన తెరమీదకు తీసుకు వచ్చింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఎవ్వరికీ కేటాయించరాదని, శాశ్వతంగా రద్దు చెయ్యాలని శశికళ వర్గం ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేసింది.

సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నాయకులు ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు. మా వర్గం తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎన్నికల కమిషన్ కు చెప్పారు.

Dinakaran faction seeks EC freeze two leave symbol permanently.

సీఎం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల పూర్తి వివరాలు భారత ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. తమిళనాడులోని అన్ని జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శలు మాకు మద్దతు ఇస్తూ ఇచ్చిన పత్రాలు ఎన్నికల అధికారులకు మరోసారి సమర్పించారు.

రెండాకుల గుర్తు మాకే కేటాయించాలని ఎన్నికల కమిషన్ అధికారులకు మనవి చేశారు. ఇదే సందర్బంలో శశికళ, టీటీవీ దినకరన్ వర్గీయులు భారత ఎన్నికల కమిషన్ ముందు వారి వాదనలు వినిపించారు. రెండాకుల చిహ్నం మాకు దక్కదని తెలుసుకున్న శశికళ, టీటీవీ దినకరన్ వర్గీయులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు ఎవ్వరికీ కేటాయించకుండా శాశ్వతంగా రద్దు చెయ్యాలని ఎన్నికల కమిషన్ ముందు మనవి చేశారు. అన్నీ పరిశీలించిన ఎన్నికల కమిషన్ అధికారులు రెండాకుల చిహ్నం విషయంలో తగిన నిర్ణయం తీసుకోవడానికి సిద్దం అవుతున్నారు.

English summary
AIADMK Dinakaran faction seeks the Election Commission to freeze two leave symbol permanently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X