వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ‌శికళను కలిసిన దినకరన్..! ఎన్నిక‌ల వేళ ప్రాధాన్య‌త సంత‌రించుకున్న భేటీ..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైద‌రాబాద : దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతున్నాయి. అదికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని కొన్ని పార్టీలు, అదికారంలోకి ఎలాగైనా రావాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు పావులు క‌దుపుతున్నాయి. అందుకోసం జాతి వైరంలా భావించే ప‌ర్టీల‌తో సైతం పొత్తుల‌కు వెన‌కాడ‌టం లేదు రాజ‌కీయ పార్టీలు. ఇక త‌మిళ‌నాడు రాజ‌కీయాలు సైతం ఊపుమీదున్న‌ట్టు తెలుస్తోంది.

<strong>అక్రమ మద్యంపై నిఘా ఏది..? ఎన్నికల వేళ ఏపి ఎక్సైజ్‌ శాఖ వింత పోక‌డ‌..!!</strong>అక్రమ మద్యంపై నిఘా ఏది..? ఎన్నికల వేళ ఏపి ఎక్సైజ్‌ శాఖ వింత పోక‌డ‌..!!

అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళతో ఏఎంఎంకే ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు. అన్నాడీఎంకేకు కేటాయించిన 'రెండు ఆకులు' గుర్తుపై దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 15న సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Dinakaran to meet Shashikala .. The election priority is attributable .. !!

రెండు ఆకుల గుర్తును అన్నాడీఎంకేకు ఎలక్షన్ కమిషన్ కేటాయించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో దినకరన్ సవాల్ చేశారు. లోక్‌సభ ఎన్నికలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమిళ‌నాడులో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి.

అదికార అన్న డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, జాతీయ పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ లతో కలిసి నడించేందుకు ఒక అవగాహనకు వచ్చాయి. వీటితో పాటు మరికొనన్ని చిన్నా చితకా పార్టీలు కూడ వీటితో జతకడుతున్నాయి. మొత్తానికి మ‌రో వారంరోజుల్లో పొత్తుల‌పై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చి సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో పాల్గొనేంద‌కు పార్టీలు సై అంటున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
AMMK MLA TTV Dinakaran met with VK Shashikal. The Supreme Court will hear the petition filed on the 'two leaves' to the AIADMK on March 15. Their meeting took significance in this background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X