చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీ, కమల్ గురువు కె. బాలచందర్ ఆస్తులు వేలం, బ్యాంకు రుణం, హీరోలు ఏం చేస్తారు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

K Balachander's Properties In Auction, no response from Rajini, Kamal

చెన్నై: ఎంతో మందికి సినీరంగంలో జీవితాన్ని ప్రసాధించి స్టార్లుగా తీర్చిదిద్ది సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కె. బాలచందర్ ఆస్తులు వేలం వేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ ను సినీరంగానికి పరిచయం చేసిన కె. బాలచందర్ కుటుంభానికి ఇలాంటి కష్టం వస్తోందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు గురువు ఆస్తుల విషయంలో ఏం చేస్తారు ? అనే చర్చ మొదలైయ్యింది.

కండెక్టర్ ఉద్యోగం

కండెక్టర్ ఉద్యోగం

సినిమాల్లో నటించాలనే కోరికతో బెంగళూరు సిటీ బస్సులో కండెక్టర్ గా పని చేసే శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నై చేరుకుని సినిమాల్లో అవకాశాల కోసం నానా తంటాలు పడ్డాడు.

శివాజీ కాదు రజనీకాంత్

శివాజీ కాదు రజనీకాంత్

శివాజీరావ్ గైక్వాడ్ పేరుకు బదులు రజనీకాంత్ అనే నామకరణం చేసిన కె. బాలచందర్ తన సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారు. బాలచందర్ శిష్యుడిగా రజనీకాంత్ తన కంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. బాలచందర్ సూచనలతో రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యారు.

కమల్ హాసన్ కు గురువు

కమల్ హాసన్ కు గురువు

కె. బాలచందర్ హీరో కమల్ హాసన్ ను విశ్వనటుడిగా తయారు చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కమల్ హాసన్. రజనీకాంత్ ఇద్దరూ కె. బాలచందర్ శిష్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమాలు దాదాపుగా అన్ని బాషల్లో సూపర్ హిట్ అయ్యాయి.

 అనారోగ్యంతో అప్పులు

అనారోగ్యంతో అప్పులు

కె. బాలచందర్ కు చెన్నైలో సొంత ఇల్లు, కార్యాలయం ఉంది. బాలచందర్ చివరి రోజుల్లో అనారోగ్యంతో అప్పులపాలైనారు. బాలచందర్ ఆత్మభిమానంతో సూపర్ స్టార్లు అయిన తన శిష్యులు రజనీకాంత్, కమల్ హాసన్ సహాయం కూడా ఆశించలేదు.

యూకో బ్యాంకులో రుణం

యూకో బ్యాంకులో రుణం

అనారోగ్యంతో బాదపడుతున్న కె. బాలచందర్ తన ఇల్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. కె. బాలచందర్ ఆనారోగ్యంతో మరణించడంతో బ్యాంకులోని రుణం, వడ్డి పేరకుపోయింది.

రూ. 1.36 కోట్లకు వేలం

రూ. 1.36 కోట్లకు వేలం

రుణం తీసుకుని చెల్లించని వారి పేర్లు, ఆస్తుల వివరాలను యూకో బ్యాంకు దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది. అందులో కె. బాలచందర్ పేరు, ఆస్తుల వివరాలు ఉన్నాయి. కె. బాలచందర్ తీసున్న రుణం చెల్లించలేదని, రూ. 1.36 కోట్లకు ఆయన ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని యూకో బ్యాంక్ ఆదివారం దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది.

రజనీ, కమల్ నిర్ణయం

రజనీ, కమల్ నిర్ణయం

సినిమాల్లో అవకాశం ఇచ్చి ఈస్థాయికి తెచ్చిన గురువు కె. బాలచందర్ ఆస్తుల విషయంపై రజనీకాంత్, కమల్ హాసన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరూ వేచి చూస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రజనీకాంత్, కమల్ హాసన్ ఇంత వరకు ఈ విషయంపై ఏ విధంగా స్పంధించలేదు.

చిన్న విషయం

చిన్న విషయం

కమల్ హాసన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కె. బాలచందర్ అప్పులు చెల్లించి ఆయన ఆస్తులు వేలం వెయ్యకుండా చెయ్యడం రజనీకాంత్, కమల్ హాసన్ కు ఓ చిన్న విషయం. అయితే ఇద్దరు హీరోలు కె. బాలచందర్ ఆస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వారి అభిమానులు, తమిళనాడు ప్రజలు వేచి చూస్తున్నారు.

English summary
The late veteran Director K Balachander's Office and House have been let for auction by the UCO Bank for Rs1.36 crore debt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X