వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాయిలెట్లు కంపుకొడుతున్నాయని 70శాతం మంది ప్రయణాలను వాయిదావేసుకొంటున్నారు

దేశంలోని ప్రధాన నగరాల్లో మరుగుదొడ్ల మురికిగా ఉన్నాయని, కంపుకొడుతున్నాయని ప్రజలు తేల్చి చెప్పారు. కోల్ కతా, డిల్లీ, ముంబాయి, చెన్నై నగరాల్లోని పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా లేవని ప్రజలు అభిప్రాయపడ్డ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ :భారత్ లోని నాలుగు ప్రధాన నగరాల్లో మరుగుడొడ్లు కంపు కొడతాయని సర్వే తేల్చింది.మరుగుదొడ్ల తో తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నట్టు ప్రజలు చెప్పారు. మరుగుదొడ్ల కారణంగా ప్రయాణాలను వాయిదా వేసుకొంటున్నారంటే ఆశ్చర్యపోతారు.95 శాతం ప్రజలు కొత్త మరుగుదొడ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలోని కోల్ కతా, డిల్లీ, చెన్నై, ముంబాయి నగరాల్లోని పబ్లిక్ టాయిలెట్లు కంపుకొడతాయని తాజా సర్వేలో తేలింది. ఈ మరుగుదొడ్లతో తాము అసంతృప్తికి గురౌతున్నట్టు ప్రజలు చెప్పారు.ఈ టాయిలెట్లు ఏ మాత్రం ప్రజలకు ఆరోగ్యకరం కావని సర్వే తేల్చింది. 95 శాతం కొత్త మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాడ్ చేస్తున్నారు.

toilets

తాము వెళ్ళాలనుకొన్న ఊరు వెళ్ళకుండా మానేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి,.మరుగుదొడ్లు సక్రమంగా లేని కారణంగానే 70 శాతం మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకొంటున్నారు. వెళ్ళాల్సిన ఊర్లను మార్చుకొంటున్నట్టు సర్వేలో అభిప్రాయపడ్డారు.డిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కతా ,హైద్రాబాద్, పుణె తదితర నగరాల్లోని పది వేల మందిని సర్వే చేసి ఈ నివేదికను తయారు చేశారు.

దేశంలోని కోల్ కతాలో మరుగుదొడ్ల పరిస్థితి అసలు బాగాలేదని ప్రజలు చెప్పారు. ఇక్కడ మరుగుదొడ్లను చూస్తే కంపుకొడతాయని లేని రోగాలు వస్తాయని ఇబ్బందిపడాల్సి వస్తోందని కోల్ కతా వాసులు అభిప్రాయపడ్డారు. 43 శాతం మంది కొల్ కతా మరుగుదొడ్ల పై తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.దేశ రాజధానిలో కూడ పరిస్థితిలో మార్పులేదు. 29 శాతం మంది మరుగుదొడ్ల పరిస్థితిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైద్రాబాద్ లో 20 శాతం మంది మరుగుదొడ్ల నిర్వహణ బాగా
లేదన్నారు. చెన్నై, ముంబాయిలలో 29 శాతం మంది పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయని చెప్పారు.పుణెలో 18శాతం,బెంగుళూరులో 14 శాతం మంది మరుగుదొడ్ల పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఈ సర్వే తెలిపింది. హాలిడే ఐ క్యూ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. పర్యాటక ప్రాంతాల్లో కూడ చాలిననని మరుగుదొడ్లు లేని విషయాన్ని కూడ సర్వే తేటతెల్లం చేసింది.

English summary
cleanless toilets top cities in country reported a survey. ngo organation conducted survey main cities in the country. kolkata, delhi, chennai, mubai people were unsatisfy public toilets cleaness.dirty toilets said people. 95 perecent people demand new public toilets.70 percent people change places because of dirty toilets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X