వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వారిని చావాలని చెప్పలేను, లీతుల్ చర్య సరైందే: ఆర్మీచీప్ బిపిన్ రావత్

జమ్ము కాశ్మీర్ లో తాము ఒక చెత్త యుద్ద వాతావరణాన్ని ఎదుర్కొంటున్నామని భారత ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ ఆవేదన వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై ఆయన తొలిసారిగా స్పందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్ లో తాము ఒక చెత్త యుద్ద వాతావరణాన్ని ఎదుర్కొంటున్నామని భారత ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ ఆవేదన వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై ఆయన తొలిసారిగా స్పందించారు.

జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకొంటున్న పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ సిబ్బంది పడుతున్న బాధ పట్ల ఆయన ఆవేశానికి లోనయ్యారు. తాము పడుతున్న కష్టాలు, మనోవేదనను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నప్పుడు వస్తున్న ఆవేశాన్ని పంటిబిగువన ఆపుతున్నట్టు చెప్పారు.

కొత్త విధానాల్లో తాము యుద్దం చేయాల్సి వస్తోందన్నారు. రాళ్ళదాడి నుండి బయటపడేందుకు ఆర్మీ యువ అధికారి లీతుల్ గొగొయ్ ఓ ఆందోళనకారుడిని మానవరక్షణ కవచంగా చేసి జీపు బానెట్ కు కట్టడాన్ని ఆయన సమర్థించారు.

 Bipin Rawat

లీతుల్ పై కేసు నమోదై కోర్టు తీర్పు వచ్చే సమయంలో తాను ప్రశంసాపత్రం ఇవ్వడం సరైన చర్యేనన్నారు.యువ ఆర్మీ అధికారులు కఠిన పరిస్థితుల్లో కూడ మనో ధైర్యం కోల్పోకుండా పోరాటేలా ప్రోత్సహించడానికే తాను ప్రశంసాపత్రం ఇచ్చానని చెప్పారు.

కాశ్మీర్ లో జరుగుతున్నది ఫ్రాక్సీవార్. అది కూడ చెత్త మార్గంలో నడుస్తోందన్నారు. ఆందోళనకారులు తమపై రాళ్ళు విసురుతున్నారు. పెట్రోల్ బాంబులు వేస్తున్నారని చెప్పారు. అలాంటి సమయంలో ఏం చేయాలని జవాన్లు అడిగితే వేచి ఉండండి, చావండి అని మాత్రం నేను వాళ్ళకు చెప్పాలా? అని ఆయన ప్రశ్నించారు.

మంచి శవపేటీక, దానిపై జాతీయ జెండాను కప్పి ఇటికి పంపుతామని చెప్పాలా? ఆర్మీ చీఫ్ గా ఇదేనా నేను వారికి చెప్పాల్సింది అని ఆయన ప్రశ్నించారు. తన సైనికులకు మరింత మనోధైర్యం ఇచ్చేందుకు అక్కడి పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారాయన.మేం చాలా ఫ్రెండ్లీ ఆర్మీ, కానీ, శాంతిభద్రతలను కాపాడేందుకు వచ్చినప్పుడు ప్రజలు గౌరవంతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

English summary
The Indian Army is facing a "dirty war" in Jammu and Kashmir which has to be fought through "innovative" ways, Army Chief Gen Bipin Rawat has said, stoutly defending the use of a Kashmiri as a 'human shield' by a young officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X