వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైకల్యాన్ని అధిగమించి రెండు గ్రామాల మహిళా సర్పంచ్ గా .. కవితా భొంద్వే ప్రస్థానం

|
Google Oneindia TeluguNews

అంగవైకల్యం అవరోధం కాదని నిరూపించింది ఓ మహిళా సర్పంచ్. తనను చూసి ఎగతాళి చేసిన వారితోనే శభాష్ అనిపించుకునేలా తానేమిటో నిరూపించుకుంది. మనసుంటే మార్గం ఉంటుంది అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది నాసిక్ జిల్లాకు చెందిన కవితా భొంద్వే. అనేక శారీరక మరియు సామాజిక అడ్డంకులు ఉన్నప్పటికీ విభిన్న ప్రతిభావంతురాలైన ముప్పై నాలుగేళ్ల కవితా భొంద్వే పంచాయతీ సర్పంచ్ గా పనిచేస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతుంది.

Recommended Video

Maharashtra : అంగవైకల్యం అవరోధం కాదని నిరూపించిన మహిళా సర్పంచ్ కవితా భొంద్వే!

రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

రెండు గ్రామ పంచాయితీలను ప్రగతి పథంలో నడిపిస్తున్న కవితా భొంద్వే

రెండు గ్రామ పంచాయితీలను ప్రగతి పథంలో నడిపిస్తున్న కవితా భొంద్వే

కేవలం ఒక గ్రామానికి మాత్రమే కాదు , రెండు గ్రామ పంచాయతీలను ఆమె ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరు అక్కడి వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్ని అంగాలు సరిగ్గా ఉన్నవారే సరిగ్గా పని చేయని నేటి రోజుల్లో విభిన్న ప్రతిభావంతురాలైన కవిత భొంద్వే పనితీరు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దహేగా మరియు వాగ్లుడ్ గ్రామాల ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం కవితా భొంద్వే రెండవ సారి పంచాయతీ సర్పంచ్ గా పని చేస్తున్నారు ఆమె మొట్టమొదటిసారి 25 సంవత్సరాల వయసులో పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు.

 ఎవరు ఎగతాళి చేసినా .. ధృడ సంకల్పంతో అంగవైకల్యాన్ని అధిగమించి సర్పంచ్ గా

ఎవరు ఎగతాళి చేసినా .. ధృడ సంకల్పంతో అంగవైకల్యాన్ని అధిగమించి సర్పంచ్ గా

ఆమె దృఢ సంకల్పం ముందు, అంకితభావం ముందు ఆమెకు అవరోధంగా ఉన్న అంగవైకల్యం ఓడిపోయింది. అంగవైకల్యం అనుకున్నది సాధించడానికి అవరోధం కాదని ఆమె నిరూపించింది. కవితా భొంద్వే గతంలో గ్రామస్తులు తనను అవహేళన చేసేవారిని, కర్రల సహాయంతో తాను నడిచే విధానాన్ని చూసి నవ్వుకునే వారిని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వారే తన పనితనాన్ని మెచ్చుకుంటున్నారు అంటూ చెప్తున్నారు. ఎవరు ఎంత అవహేళన చేసినా తాను ఏనాడు కృంగి పోలేదని, తాను అనుకున్నది సాధించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని విడిచి పెట్టలేదని కవితా భొంద్వే చెబుతోంది.

తనకు తన తండ్రి , గ్రామంలోని చాలామంది పెద్దలు స్ఫూర్తి అంటున్న కవిత

తనకు తన తండ్రి , గ్రామంలోని చాలామంది పెద్దలు స్ఫూర్తి అంటున్న కవిత

తన తండ్రి నుండి గ్రామంలోని చాలా మంది పెద్దవారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్తున్న కవిత ఒక సర్పంచ్ గా పాలనలోను తనదైన మార్కును చూపిస్తోంది. ఎక్కడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆమె గ్రామపంచాయతీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తగిన కృషి చెయ్యాలని తనకు స్ఫూర్తినిచ్చిన తండ్రిని, గ్రామంలోని పెద్దల సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేని కవిత చెబుతున్నారు.

ఎగతాళి చేసిన నోటితోనే సర్పంచ్ కవితా భొంద్వే కు మెచ్చుకోలు

ఎగతాళి చేసిన నోటితోనే సర్పంచ్ కవితా భొంద్వే కు మెచ్చుకోలు

తనను నమ్మి గ్రామ సర్పంచ్ గా అవకాశమిచ్చిన రెండు గ్రామాల ప్రజలకు పంచాయతి నుండి సేవలందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. పంచాయతీ సర్పంచ్ గా కవితా భొంద్వే పాలన పట్ల రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిజాయితీని కొనియాడుతున్నారు.

ఎవరైతే ఆమెను ఎగతాళి చేశారో వారే ఇప్పుడు కవిత భొంద్వే ను శభాష్ అంటున్నారు .

English summary
A female sarpanch proves that disability is not a barrier. She proved herself to be the only one who looked at her and made fun of her. Kavita Bhondwe from Nashik district is a direct example where the will there is the way . Thirty-four-year-old Kavita Bhondwe, who is a talented person despite many physical and social barriers, serves as the Panchayat Sarpanch for two villages .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X