వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరించి..ఉసూరుమనిపించి: పంద్రాగస్టు నాటికి కోవ్యాగ్జిన్ అందుబాటులో తెస్తామంటూ: చివరికి నిరాశే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌‌పై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక ప్రకటన వెలువడుతుందని దేశ ప్రజలు ఆశించారు. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం ఇదివరకు సంకేతాలను కూడా ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తామంటూ ఇదివరకే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ సైన్సెన్స్ (ఐసీఎంఆర్) వెల్లడించింది కూడా.

బురదలో కూరుకుపోయిన మంత్రి అవంతి వాహనం: అనూహ్య ఘటనతో: తోసిన పోలీసులుబురదలో కూరుకుపోయిన మంత్రి అవంతి వాహనం: అనూహ్య ఘటనతో: తోసిన పోలీసులు

ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలంటూ భారత్ బయోటెక్‌కు ఐసీఎంఆర్ లేఖ కూడా రాసింది. దీనితో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని దేశ ప్రజలు ఆశించారు. చివరికి నిరాశే ఎదురైంది. మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయంటూ ప్రధాని ప్రకటించారే తప్ప.. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే వివరాలను స్పష్టం చేయలేదు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్జిన్‌ను వచ్చేనెల 15వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తుందని భావించారు.

 Disappointed: No Covid19 Vaccine on Independece day as announced earlier

ఆగస్టు 15వ తేదీ నాడు కోవ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రాథమికంగా చర్యలు కూడా చేపట్టింది. దీనికోసం కిందటి నెల 5వ తేదీన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ.. భారత్ బయోటెక్‌కు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ సరఫరాపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం నాడే కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఆయా పరిణామాలన్నీ వ్యాక్సిన్‌పై ఆశలను రేకెత్తించాయి.

Recommended Video

COVID -19 : ఫుడ్ డెలివరీ ద్వారా కరోనా వస్తుందా ? WHO ఏం చెప్పిందంటే ! || Oneindia Telugu

ఆ తరువాత.. ఐసీఎంఆర్ ఓ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. నిర్దేశిత సమయానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని పేర్కొంది. దీనికి అనుగుణంగానే ప్రధాని ప్రకటన కూడా వెలువడింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. వ్యాక్సిన్ మీద ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. కరోనా వ్యాక్సిన్ నిర్మూలించడానికి దేశంలో మూడు వ్యాక్సిన్‌లో రూపొందుతున్నాయని ప్రధాని ప్రకటించారు. అవన్నీ ట్రయల్స్ దశలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయనేది వెల్లడించలేదు.

English summary
Much like the rest of the world, India too is waiting with bated breath for a COVID-19 vaccine. Drug Controller General of India’s (DCGI) approval to conduct human trials of Covaxin developed jointly by Bharat Biotech, National Institute of Virology and the IndianCouncil of Medical Research (ICMR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X