వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్ ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు.. విత్ డ్రాకి ఈ నిబంధనలు తప్పనిసరి..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ తర్వాత చాలామంది పేదలు ఉపాధి కోల్పోవడంతో వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజనా పథకం కింద రూ.1.70లక్షల కోట్లు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మూడు నెలల పాటు మహిళల జన్ ధన్ ఖాతాల్లో ప్రతీ నెలా రూ.500 జమ చేయనున్నారు.

Recommended Video

:Lockdown :Considerable Relaxation From Lockdown For Many Districts From May 4

చెప్పినట్టుగానే ఏప్రిల్ నెలలో జన్ ధన్ ఖాతాల్లో రూ.500 జమ అయ్యాయి. మే నెల కోటాకు సంబంధించి తాజాగా జన్ ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున డబ్బులు జమ చేశారు. అయితే ఖాతాల్లో డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు,ఏటీఎంల వద్దకు క్యూ కడుతుండటంతో కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. బ్యాంకులు,ఏటీఎంల వద్ద రద్దీని తగ్గించేందుకు సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.

 disbursal plan for jan dhan yojan women benificiaries When to withdraw money

దీని ప్రకారం.. బ్యాంకు ఖాతా చివరి రెండు నంబర్లు 0,1గా ఉన్నవాళ్లు మే 4వ తేదీన డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతా చివరి రెండు నంబర్లు 2,3గా ఉన్నవాళ్లు మే 5న విత్ డ్రా చేసుకోవాలి. చివరి రెండు నంబర్లు 6,7గా ఉన్నవాళ్లు మే 8న విత్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖాతా చివరి రెండు నంబర్లు 8,9గా ఉన్నవాళ్లు మే 11వ తేదీన విత్ డ్రా చేసుకోవాలి.

ఒకవేళ మే 11 లోపు ఎవరైనా విత్ డ్రా చేసుకోకపోతే.. ఆ తర్వాత వారి వీలును బట్టి ఎప్పుడైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. వారి నగదు వెనక్కి వెళ్లడం వంటిది జరగదు. వంద శాతం ఆ డబ్బు వారి ఖాతాల్లో భద్రంగా ఉంటుంది. బ్యాంకులు,ఏటీఎంల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు అనువుగా కేంద్రం ఈ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది.

English summary
The Finance Ministry has begun crediting the second (May) instalment of ₹500 to the women account holders of Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) as part of the Pradhan Mantri Garib Kalyana Package ( PMGKP), a top official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X