పంబ నదిలో దుస్తులు వేస్తే జైలు శిక్ష
కేరళ: శబరిమల యాత్రికులు, అయ్యప్ప భక్తులు పంబ నదిలో దుస్తులు, వివిధ వస్తువులు విడిచివేయడం పట్ల కేరళ హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఇక మీద పంబ నదిలో దుస్తులు, వస్తువులు వదిలి వేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హై కోర్టు హెచ్చరించింది.
నదీ జలాలను కలుషితం చేస్తుంటే చూస్తూ ఉండలేమని స్పష్టం చేసింది. ఇక మీద నదిలో దుస్తులు వేస్తే వారి మీద అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రకారం దుస్తులు, వస్తువులు వేసిన వారికి గరిష్టంగా ఆరేళ్ల జైలు శిక్షతో పాటు అపరాధరుసం విధించనున్నారు.

హై కోర్టు తీర్పుపై శబరిమల ప్రత్యేక కమిషనర్ బాబు స్పందించారు. శబరిమల భక్తులు పుణ్యం కోసం, ఇతర కారణాల వలన తమకు సంబంధించి దుస్తులు, వస్తువులు పంబ నదిలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయ్యప్ప భక్తులకు పంబ నదిలో దుస్తులు, వస్తులు వదిలితే పుణ్యం వస్తుందనే సెంటిమెంట్ ఉంది. అయితే ఇప్పుడు కేరళ హై కోర్టు ఆదేశాలతో వారి సెంటిమెంట్ వదులుకోవలసి ఉంది. భక్తుల కోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టడానికి కేరళ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది.












Click it and Unblock the Notifications