వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లపై మోడీతో చర్చించా, ఎవరూ శిక్ష తప్పించోకోలేరు: అరవింద్ కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఘర్షణలపై చర్చించారు. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మోడీతో ఢిల్లీ అల్లర్లు, కరోనావైరస్‌పై చర్చించా..

మోడీతో ఢిల్లీ అల్లర్లు, కరోనావైరస్‌పై చర్చించా..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ పైనా వీరిద్దరూ చర్చించారు. ఢిల్లీ ఘర్షణలకు కారణమైన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించిన్లు అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. మరోసారి దేశ రాజధానిలో ఇలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇక కరోనావైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇంతకుముందు అమిత్ షాతో భేటీ..

ఇంతకుముందు అమిత్ షాతో భేటీ..

దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఘర్షణలపై గత వారం క్రితం హోంమంత్రి అమిత్ షాను అరవింద్ కేజ్రీవాల్ కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి సంబంధించిన కీలక అంశాలపై హోమంత్రితో చర్చించినట్లు, చర్చలు ఫలవంతమయ్యాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ఢిల్లీలో శాంతి కోసం అన్ని పార్టీలు కూడా కలిసివచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు.

Recommended Video

Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16 | Oneindia Telugu
ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన కేజ్రీవాల్

ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన కేజ్రీవాల్

ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాల్లో 68 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 8 స్థానాలను భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది. 2015లో కేజ్రీవాల్ పార్టీకి 67 సీట్లు రాగా, 54.34 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈసారి మాత్రం 62 సీట్లను దక్కించుకున్న ఆప్.. 53.57 శాతానికి ఓటింగ్ తగ్గడం గమనార్హం. అసెంబ్లీలో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా రాలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

English summary
In his first meeting with Prime Minister Narendra Modi after taking charge as Delhi Chief Minister, Arvind Kejriwal said that the two leaders discussed the communal clashes that killed over 45 people in the capital last week. They also discussed the coronavirus infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X