వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపి తీరుపై సిఎంకు వివరించా: శ్వేతా మీనన్

|
Google Oneindia TeluguNews

Swetha Menon
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీని ఆదివారం కలిసినట్లు సినీ నటి శ్వేతా మీనన్ తెలిపారు. కొళ్లాంలో జరిగిన సంఘటన గురించి ఆయనకు వివరించినట్లు ఆమె చెప్పారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీని కలిసిన ఆమె కోళ్లాం ఘటన గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు. కొళ్లాం కార్యక్రమంలో ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా ఉమెన్ ఛాందీకి తెలిపినట్లు ఆమె చెప్పారు.

అక్టోబర్ 2న కొళ్లాంలో జరిగిన బోట్ రేస్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పీతాంబర కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేసిన శ్వీతా మీనన్ ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేగాక కార్యక్రమంలో తనను తాకుతున్నట్లు టెలివిజన్స్‌లో వచ్చిన విజువల్స్‌ను పోలీసులకు చూపించినట్లు కూడా తెలిసింది. అయితే ఫిర్యాదు చేసిన గంటల్లోనే ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందె.

ఎంపి కురుప్ తనకు క్షమాపణలు చెప్పడంతోనే ఫిర్యాదును శ్వేతా మీనన్ వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే తన తండ్రి, భర్త, తన గురువు చెప్పినందువల్లే తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు శ్వేతా మీనన్ తెలిపారు. కాగా నవంబర్ 3న పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో శ్వేతా మీనన్ తనను వేరే వ్యక్తి వేధించినట్లుగా ఉన్న కొన్ని చిత్రాలను ఆధారాలుగా చూపించారని తెలిసింది.

శ్వేతా మీనన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో కేసును చట్టం ప్రకారం మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా కొళ్లాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతాప వర్మ థాంపన్ శ్వేతా మీనన్‌ చర్యలపై ఆరోపణలు గుప్పించారు. అంతేగాక తనకు బెదిరింపు లేఖలు వచ్చాయని పోలీసులను ఆశ్రయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary

 Actress Swetha Menon today said she met Kerala Chief Minister Oommen Chandy and informed him about the Kollam incident earlier this month when a Congress MP allegedly groped her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X