వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ స‌భ‌లోట్రిపుల్ తలాక్ బిల్లుపై రేపే చ‌ర్చ‌..!ప్ర‌తిప‌క్షం సంయ‌మ‌నం పాటించాలంటున్న కేంద్ర మంత్రి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/ హైద‌రాబాద్ : అత్యంత వివాదాస్ప‌ద‌మైన ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం 27వ తేదీన చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ముస్లిం వుమెన్ ప్రొటెక్ష‌న్ బిల్లుపై అదే రోజున లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. ఆ బిల్లుపై చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఇవాళ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ను కోరారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లుపై అభిప్రాయాలు వెలుబుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందించారు. స‌భ శాంతియుతంగా జ‌రిగేందుకు అవ‌కాశం ఇస్తే, క‌చ్చితంగా ట్రిపుల్ త‌లాక్‌పై చ‌ర్చిస్తామ‌న్నారు ర‌విశంక‌ర ప్ర‌సాద్.

రేపే త్రిపుల్ త‌లాక్ పై చ‌ర్చ..! గంద‌ర‌గోళం ఒద్దంటున్న కేంద్రం..!!

రేపే త్రిపుల్ త‌లాక్ పై చ‌ర్చ..! గంద‌ర‌గోళం ఒద్దంటున్న కేంద్రం..!!

భారతదేశంలోని ముస్లింలలో ఈ 'ట్రిపుల్ తలాక్'పై అధికారిక లెక్క‌లు ఏమీ లేవు. అతి తక్కువ మందితో నిర్వహించిన ఒక ఆన్‌లైన్ సర్వేలో, ఒక్కశాతం కన్నా తక్కువ మంది ఈ రకం విడాకుల విధానాన్ని ఉపయోగించుకున్నారని తెలిసింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ బిల్లుపై రాజ్యసభలో కూడా చర్చించి, ఆమోదం పొందితే, అది చట్టంగా రూపొందుతుంది. అందుకు రేపు గురువారం కేంద్రం శ్రీ‌కారం చుట్ట‌బోతోంది.

అసలు ' ట్రిపుల్ తలాక్' అంటే ఏంటి? ఎందుకు నిషేదించాల‌ని చూస్తున్నారు..!!

అసలు ' ట్రిపుల్ తలాక్' అంటే ఏంటి? ఎందుకు నిషేదించాల‌ని చూస్తున్నారు..!!

'ట్రిపుల్ తలాక్' లేదా 'తలాక్-ఉల్-బిద్దత్' అనేది 'తలాక్' చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు. దీనిని మాటల ద్వారా లేదా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా - ఎలాగైనా చెప్పవచ్చు. దీనిని నిషేధించాలంటూ ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో, కోర్టు ఇది రాజ్యాంగవిరుద్ధం అంటూ ఈ ఏడాది ఆగస్టులో దానిని నిషేధించిన విష‌యం తెలిసిందే..!!

 ముస్లిం మ‌హిళ‌ల మ‌నోభావాలు గౌర‌వించాలి..! అందుకే ర‌ద్దు చేస్తున్నామంటున్న కేంద్రం..!

ముస్లిం మ‌హిళ‌ల మ‌నోభావాలు గౌర‌వించాలి..! అందుకే ర‌ద్దు చేస్తున్నామంటున్న కేంద్రం..!

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. కొన్ని ముస్లిం మహిళా బృందాలు దీని వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం ఉండదని వాదిస్తున్నాయి. వివాహ బంధాన్ని కొనసాగించడంలో మహిళలకు కూడా సమానమైన హక్కులు, రక్షణ వ్యవస్థలు ఉండాలని, వివాహ రద్దు విషయంలో తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 చ‌ర్చ సంద‌ర్బంగా భావోద్వేగాలు వ‌ద్దు..! అంద‌రూ స‌హ‌క‌రించాలంటున్న బీజేపి..!!

చ‌ర్చ సంద‌ర్బంగా భావోద్వేగాలు వ‌ద్దు..! అంద‌రూ స‌హ‌క‌రించాలంటున్న బీజేపి..!!

కేవలం జైలులో పెట్టడం వల్ల లక్ష్యం నెరవేరదు. దీని వల్ల భర్తలు తాము జైలులో ఉండడం వల్ల భరణం చెల్లించలేకపోతున్నామని కూడా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు భార్యలే తమను, తమ పిల్లలనూ పోషించుకోవాల్సి వస్తుందని వారు అంటున్నారు. సున్నీ ఇస్లామిక్ చట్టంలోని మూడు సాంప్రదాయాలు 'ట్రిపుల్ తలాక్' విధానం ఇప్పుడు చెల్లుబాటు కాదని చెబుతున్నా... నాలుగోది అయిన దేవ్‌బంద్ సాంప్రదాయంలో మాత్రమే ఈ వివాదాస్పద విధానం ప్రస్తుతం చెల్లుబాటులో ఉంది.

English summary
The debate on the highly controversial triple talaq will be held on Thursday 27th in lok sabha. The debate on the Women's Protection Bill will be held on the same day in Lok Sabha. Congress MP Mallikarjun Kharge asked Speaker Sumitra Mahajan to discuss on the bill. The Congress is ready to express its views on the triple talaq bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X