• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చుపై రోజుకో చర్చ ...ఇంతకీ ఆ ఖర్చు ఎంతంటే !!

|

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ ముంబై ని వీడి తన స్వస్థలమైన మనాలికి చేరుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అనేక వివాదాలు , హెచ్చరికల మధ్య సెప్టెంబరు 9న ముంబైకి వెళ్లిన కంగనా రనౌత్ సోమవారం ముంబైని వీడి తన ఇంటికి చేరుకున్నారు.ప్రాణాలతో బయటపడ్డానని ట్వీట్ చేశారు .అయితే కంగనా రనౌత్ విషయంలో రోజుకో వివాదం దుమారంగా మారుతుంది.

జయా బచ్చన్ కు కౌంటర్ ఇచ్చిన కంగనా ... నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారా ?

కంగనా సెక్యూరిటీ విషయంలో రోజుకో విమర్శ

కంగనా సెక్యూరిటీ విషయంలో రోజుకో విమర్శ

మహారాష్ట్ర సర్కార్ తో కయ్యానికి కాలు దువ్విన కంగనా రనౌత్ కు ప్రాణహాని ఉన్నకారణంగా ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీని అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనారనౌత్ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ పై పెద్ద ఎత్తున దుమారమే కొనసాగుతోంది.

బాలీవుడ్ లో ఒక నటీమణి కి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అవసరమా అని , తాము చెల్లిస్తున్న ట్యాక్స్ ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నాయని కుబ్రా సేత్ వంటి నటీమణులు మాత్రమే కాదు, చాలామంది కంగనా సెక్యూరిటీ విషయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి నెలకు 10లక్షల ఖర్చు : సుప్రీం కోర్టు అడ్వకేట్ బ్రిజేష్

వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి నెలకు 10లక్షల ఖర్చు : సుప్రీం కోర్టు అడ్వకేట్ బ్రిజేష్

తాజాగా సుప్రీంకోర్టు అడ్వకేట్ బ్రిజేష్ కలప్ప కంగనా రనౌత్ కు కేంద్రం కేటాయించిన సెక్యూరిటీని తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు .అంతేకాదు ఒక మనిషికి నెల రోజుల పాటు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వం పై పది లక్షల రూపాయల భారం పడుతుంది అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్నుల నుండి ఈ విధంగా అనవసరపు సెక్యూరిటీల కోసం రూ ఖర్చు చేస్తారు అంటూ ఆయన పోస్ట్ లో తెలిపారు.

బ్రిజేష్ వ్యాఖ్యలపై కంగనా స్పందన ఇదే

బ్రిజేష్ వ్యాఖ్యలపై కంగనా స్పందన ఇదే

ప్రస్తుతం కంగనారనౌత్ హిమాచల్ ప్రదేశ్ లో సురక్షితంగా ఉన్నారని , ప్రభుత్వం కంగనారనౌత్ కు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెబుతుందా ? అంటూ ప్రశ్నించారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ బ్రిజేష్ కలప్ప .

సుప్రీం కోర్టు అడ్వకేట్ బ్రిజేష్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందించారు. బ్రిజేష్ జీ ... మీరు నేను చెప్పే విషయాలను ఆధారంగా ఊహించుకుని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అపాయం ఉందా లేదా అనే విషయాన్ని విచారణ జరిపి , దాని ఆధారంగానే సెక్యూరిటీ గ్రేడ్ ను నిర్ణయిస్తారు.

కంగనా కు సెక్యూరిటీ అనవసరపు ఖర్చు అంటూ విమర్శలు

కంగనా కు సెక్యూరిటీ అనవసరపు ఖర్చు అంటూ విమర్శలు

ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో నాకు ప్రమాదం ఉందని తెలిస్తే భద్రతను మరింత పెంచొచ్చు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో భద్రతను పూర్తిగా తీసేయవచ్చు అంటూ బ్రిజేష్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు.

ఏది ఏమైనా కంగనా రనౌత్ కు వైట్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇవ్వడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అనవసరపు ఖర్చు అంటూ మండిపడుతున్నారు. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి నెలకు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటూ లెక్కలు చెబుతున్నారు.

  AP Budget 2020-2021 Highlights : Major Allocations శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు...!!
  కంగనా సెక్యూరిటీ ఎఫెక్ట్ .. సెక్యూరిటీ వ్యవస్తపైనే పెద్ద చర్చ

  కంగనా సెక్యూరిటీ ఎఫెక్ట్ .. సెక్యూరిటీ వ్యవస్తపైనే పెద్ద చర్చ

  ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం, కంగనా రనౌత్ తండ్రి అభ్యర్థన మేరకు, కేంద్రం దృష్టికి కంగనారనౌత్ వ్యవహారాన్ని తీసుకువచ్చారని, ఆమెకు ప్రాణహాని ఉందని నిర్ధారణ అయిన తర్వాతనే వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం అందించిందని పేర్కొన్నారు.

  కంగనారనౌత్ కు వై ప్లస్ సెక్యూరిటీ అందించటంతో ఇప్పుడు మొత్తం సెక్యూరిటీ వ్యవస్థ , దాని నిర్వహణకు అయ్యే ఖర్చుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

  English summary
  Recently, Supreme Court Advocate Brijesh Kalappa posted on social media that the security assigned to Kangana Ranaut should be removed from the Center. He said it would cost the central government Rs 10 lakh per person to set up Y-plus category security for a month. Kangana reacted on Brijesh post .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X