వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్, ఎల్ఏసీ పరిస్థితి వేరు, పీఎల్ఏతో డిస్కషన్స్ కంటిన్యూ: ఉత్తర ఆర్మీ చీఫ్ జోషి

|
Google Oneindia TeluguNews

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వాస్తవిక నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారత దళాలు చర్యలు తీసుకుంటున్నాయని ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. కార్గిల్‌లో పాకిస్తాన్‌పై భారత్ పోరాడా విజయం సాధించి 21 ఏళ్లు అవుతోన్న సందర్భంగా 'ఇండియా టుడే'తో లెప్టినెంట్ జనరల్ వైకే జోషి మాట్లాడారు. ఎల్ఏసీ వద్ద ఇదివరకటి పరిస్థితిని తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

ప్రస్తుతం తాము చైనాతో చర్చలు జరుపుతున్నామని, పరిస్థితి ఉద్రిక్తత తగ్గించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. కమాండర్ లెవల్ స్థాయిలో ఇప్పటికే నాలుగుసార్లు చర్చలు కూడా జరిగాయని వివరించారు. పీఎల్ఏ ప్రతినిధులతో చర్చల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పిన జోషి.. ఎల్ఏసీ నుంచి చైనా పూర్తిస్థాయిలో తన బలగాలను ఎప్పుడూ వెనక్కి తీసుకుంటుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

Disengagement with China initiated, efforts on for status quo ante: northern Army chief..

ఇరుపక్షాలు కూడా పట్టు విడుపు ఉండాలని పరోక్షంగా చెప్పారు. అయితే ఎల్ఏసీ వద్ద ప్రస్తుత పరిస్థితి 1999లో కార్గిల్‌ మాదిరిగా లేదన్నారు. ఆపిల్, ఆరెంజ్‌లను పోల్చలేమని.. కార్గిల్ పరిస్థితి వేరు, తూర్పు లడాఖ్ వద్ద గల సిచుయేషన్ వేరు అని తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో భారత ఆర్మీ శక్తి, సామర్థ్యాలు పెరిగాయని తెలిపారు. గతేడాదితో పోల్చితే నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే శాతం 39 పెరిగిదని చెప్పారు. అయితే ఎల్ఏసీ, ఎల్‌వోసీ వేర్వేరు అని స్పష్టంచేశారు.

English summary
Indian Armed Forces would take all measures to ensure restoration of status quo ante at the lac, says Lt Gen YK Joshi, Army commander northern command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X