వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాగాంధీతో అల్కా లాంబా భేటీ.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : హస్తిన అసెంబ్లీకి ఎన్నికల సమయం సమీపిస్తోంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులు, మేనిఫెస్టోపై ఫోకస్ చేశాయి. మరోవైపు కొందరు అసంతృప్త నేతలు పార్టీ వీడుతున్నారు. ఆప్‌లో రెబల్ నేత, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబా ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇప్పటికే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబావుటా ఎగరవేసిన అల్కా లాంబా ... తాజాగా తన భవిస్యత్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీంతో భేటీ అయ్యారు.

కశ్మీర్‌లో పరిస్థితేం బాగోలేదు.. సవ్యంగా ఉందని కేంద్రం కబుర్లు చెప్తుంది... శ్రీనగర్ మేయర్ మట్టు <br>కశ్మీర్‌లో పరిస్థితేం బాగోలేదు.. సవ్యంగా ఉందని కేంద్రం కబుర్లు చెప్తుంది... శ్రీనగర్ మేయర్ మట్టు

ధిక్కార స్వరం

ధిక్కార స్వరం

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై బాహాటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు అల్కా లాంబా. గత నెలలో తాను పార్టీకి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. తన నియోజకవర్గం చాందినిచౌక్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఆమె మీడియాతో ఈ వ్యాఖ్యలు చేయడంతో .. పార్టీ కూడా ధీటుగానే స్పందించింది. అల్కా లాంబా తన ఎమ్మెల్యే పదవీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని స్పష్టంచేసింది. కానీ ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న అల్కా లాంబా ఇవాళ తన రాజకీయ కార్యాచరణను ప్రారంభించారు. ఉదయం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీంతో సమావేశమయ్యారు. సోనియా నివాసంలో ఆమెతో లాంబా భేటీ అయ్యారు. వీరి మధ్య పార్టీలో చేరికపై చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఓ వైపు వరాలు ..

ఓ వైపు వరాలు ..

2015లో భారీ మెజార్టీతో హస్తిన కోటలో అధికారం చేపట్టిన ఆప్ ..మళ్లీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం మహిళలకు బస్సులు, మెట్రోలు ఉచిత రవాణా అంటూ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. తర్వాత మంచినీటి బిల్లులను కూడా తామే కడుతామని ప్రకటించి .. మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో తిరిగి పగ్గాలు చేపట్టాలని భావిస్తోన్న ఈ తరుణంలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ వీడటం ఆ పార్టీకి నష్టమే. కానీ ఆప్ అధినేత, నేతలు మాత్రం లాంబాతో దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. సీఎం కేజ్రీవాల్ ప్రచార సమయంలో పాల్గొనాలని లాంబాకు సూచించిన ఆమె లెక్క చేయలేదు. దీంతో ఆమెపై పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. లోక్ సభ ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత ఆప్ ఎమ్మెల్యేల అధికార వాట్సాప్ గ్రూపు నుంచి లాంబాను తొలగించారు. మరోవైపు గత ఏప్రిల్‌లో ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్‌తో లాంబాకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలని ఆదేశించారు కూడా.

చేరిక లాంఛనమే ..

చేరిక లాంఛనమే ..

ఇవాళ సోనియాగాంధీతో లాంబా భేటీతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనమే అయ్యింది. అయితే ఆమె ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే అంశంపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సముచిత స్థానం లభిస్తోందని తెలిసింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న చాందిని చౌక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అల్కా లాంబా పోటీకి దిగుతారని విశ్వసనీయంగా తెలిసింది.

English summary
AAP MLA Alka Lamba is likely to join Congress after several months of bitter relations with the party and its chief Arvind Kejriwal. Alka Lamba met Congress interim president and UPA chairperson Sonia Gandhi on Tuesday. Alka Lamba visited Sonia Gandhi at her residence on Tuesday morning. Assembly elections will be held in Delhi in 2020 with AAP seeking re-election after a resounding victory in the 2015 elections. Earlier in August, Alka Lamba, who is the AAP MLA from Chandni Chowk, said that she has decided to resign from the primary membership of the party and will contest the upcoming Delhi Assembly polls as an independent candidate. The party, too, had said that it was ready to accept her resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X