హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ హంతకులకు కఠిన శిక్ష, చట్టం చేసేందుకు రెడీ:లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్ దిశ లైంగికదాడి, హత్య పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. సభ ప్రారంభం కాగానే దిశ అంశంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. ఘటనపై పార్టీల వారీగా నేతలు స్పందించారు. దిశ ఘటనపై ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో గళమెత్తారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల సూచనమేరకు మరింత కఠిన చట్టాలు అమలుచేస్తామని కేంద్రం సభలో ప్రకటించింది.

బహిరంగంగా ఉరితీయండి: దిశ ఘటనపై జయాబచ్చన్ డిమాండ్, ముక్తకంఠంతో పార్లమెంటుబహిరంగంగా ఉరితీయండి: దిశ ఘటనపై జయాబచ్చన్ డిమాండ్, ముక్తకంఠంతో పార్లమెంటు

దిశ హత్య అమానుషం..

దిశ హత్య అమానుషం..

దిశ అమానుష ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడారు. వెటర్నరీ డాక్టర్ హత్య బాధాకరమని అభిప్రాయపడ్డారు. దిశ హత్యను యావత్ దేశం ఖండిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. నిందితులను వదిలిపెట్ట ప్రసక్తే లేదని సభలో తేల్చిచెప్పారు. కఠిన శిక్ష విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. నిర్భయ తర్వాత మరింత కఠిన చట్టాలు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

నిర్భయ తర్వాత..

నిర్భయ తర్వాత..

దిశను దుండగులు దారుణంగా హింసించారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. నిర్భయ తర్వాత ఆ తరహాలో కీచకులు వ్యవహరించారని తెలిపారు. వారికి చట్టపరంగా కఠిన శిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వారిని వదిలిపెట్టబోమని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. లేదంటే మరికొందరు కీచకులు రెచ్చిపోయే అవకాశం ఉందన్నారు.

ఆందోళన సెగ..

ఆందోళన సెగ..

దిశ హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నేతలు ర్యాలీలు తీసి తమ నిరసనను తెలియజేస్తున్నారు. దిశ హత్య కేసులో నిందితులను ఉరి తీసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఢిల్లీలో పలువురు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీరికి ప్రజాసంఘాలు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నాయి.

రిమాండ్ ఖైదీలుగా..

రిమాండ్ ఖైదీలుగా..

దిశను అత్యంత కిరాతకంగా మట్టుబెట్టిన కిరాతకులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. శనివారం వారిని షాద్ నగర్ పోలీసు స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వారిని తరలించే సమయంలో షాద్ నగర్ పోలీసుస్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు అడ్డుకున్నారు. తమకు అప్పగించాలని, ఐదు నిమిషాల్లో గుణపాఠం చెబుతామని కోరారు. ఇటు చర్లపల్లి జైలు వద్ద కూడా అలాంటి పరిస్థితి కనిపించింది.

English summary
disha accused will be punished defence minister rajnath singh said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X