హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha murder Case: మాకు న్యాయం దక్కలేదు..మీకు అలా జరక్కూడదు: దిశా కుటుంబంతో నిర్భయ తల్లి..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాదీ వెటర్నరి డాక్టర్ దిశా హత్యోదంతంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ రెండు హృదయ విదారకమైన సంఘటనల మధ్య సారూప్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ రెండు ఘటనలు బాధితుల కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదని అన్నారు. నిర్భయ దారుణ హత్యకు గురైన ఏడేళ్ల తరువాత కూడా న్యాయం దక్కలేదని, దిశా కుటుంబ సభ్యుల విషయం అలా జరక్కూడదని చెప్పారు.

సోమవారం ఆమె దిశా తల్లిదండ్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిర్భయకు న్యాయం దక్కే విషయంలో నెలకొన్న జాప్యం.. దిశ కేసులో చోటు చేసుకోకూడదని తాను అకాంక్షిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నిర్భయ హంతకులకు క్షమాభిక్షను ప్రసాదించాలంటూ దాఖలైన పిటీషన్ పై సిఫారసు చేయడానికి ఢిల్లీలోకి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిరాకరించడం పట్ల ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు.

Disha Murder: Unlike us who had to fight for 7 years, she should get justice soon, says Nirbhayas mother Asha Devi

క్షమాభిక్షను ప్రసాదించాలంటూ దాఖలైన పిటీషన్ ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. వీలైనంత త్వరగా నిర్భయ హంతకులకు ఉరి శిక్ష పడాలని ఆమె పునరుద్ఘాటించారు. ఏడేళ్ల తరువాత కూడా నిర్భయకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ తల్లిదండ్రులకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పారు. కామాంధుల చేతుల్లో బలైన వారి కుమార్తెకు సత్వర న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని దిశ తల్లిదండ్రులకు తెలియజేశానని అన్నారు.

Disha Murder case: దేశానికే దిశా నిర్దేశం: బెంగళూరులో అత్యుత్తమ టెక్నాలజీ: ఆపదలో ఉన్న 7 సెకెన్లలో.Disha Murder case: దేశానికే దిశా నిర్దేశం: బెంగళూరులో అత్యుత్తమ టెక్నాలజీ: ఆపదలో ఉన్న 7 సెకెన్లలో.

హైదరాబాద్‌ లో వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం, హత్యకు గురి కావడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. తమ కుమార్తె విషయంలో ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని, దిశ విషయంలో న్యాయం త్వరితగతిన జరుగుతుందని అన్నారు. ఆశాదేవి కుమార్తె నిర్భయపై 2012 డిసెంబర్ 16వ తేదీన అర్ధరాత్రి ఆరుమంది నడుస్తున్న బస్సులో దారుణంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. సుమారు 13 రోజుల పాటు ఆమె మృత్యువుతో పోరాడారు. అదే నెలలో మరణించారు. నిర్భయ కేసుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించారు. ఓ నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్షను అంగీకరించ వద్దని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు సిఫార్సు చేసింది.

Disha Murder: Unlike us who had to fight for 7 years, she should get justice soon, says Nirbhayas mother Asha Devi
English summary
Hyderabad veterinary doctor should get justice soon, said Nirbhaya's mother Asha Devi terming what Disha had suffered was 'barbaric'. In an interview, Asha Devi said that justice to the young doctor should not take seven years. "She should get justice sooner than our own family, which has been fighting for seven years," Asha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X