వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిశ రవి కేసు: మీడియా, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు, సంచలనాలు వద్దు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త దిశ రవి అరెస్ట్, టూల్ కిట్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలకు సంబంధించిన 'టూల్‌కిట్' వ్యవహారంలో అరెస్టైన దిశ రవికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇతర దర్యాప్తునకు సంబంధించి లీకైన వివరాలను ప్రచురించొద్దని మీడియాను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఆ సమాచారాన్ని అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకుని, దాని వల్ల దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల దర్యాప్తునకు ఆటంకాలు కలగవచ్చని అభిప్రాయపడింది.

 Disha Ravi Case: High Court Caution For Delhi Police, Media Over Probe

తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కు సంబంధించి ఎలాంటి దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయకుండా చూడాలంటూ దిశ రవి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ప్రతిభా సింగ్ ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారించింది.

అయితే, ఇప్పటి వరకు ప్రచురితమైన వార్తల్ని, పోలీసులు చేసిన ట్వీట్లు తొలగించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్ అభ్యన్థనను మాత్రం ధర్మాసనం పరిగణిలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి గతంలో ప్రచురించిన కొన్ని వార్తలు సంచలనాత్మకంగా, పక్షపాతపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

మీడియాతోపాటు ఢిల్లీ పోలీసులకు కూడా హైకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. మీడియాకు సమాచారాన్ని లీక్ చేయలేదంటూ దాఖలు చేసిన ప్రమాణపత్రానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తుపై చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

English summary
A day after three news channels got notice over activist Disha Ravi's petition - linked to the coverage of her arrest in a case related to the farmers' protest toolkit shared by Swedish teen climate crusader Greta Thunberg earlier this month - the Delhi High Court today made observations about "sensationalism" in reporting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X