చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళతో రెబల్ ఎమ్మెల్యేల భేటీ: దినకరన్ ను నమ్ముకుని రోడ్డునపడ్డామని ఆవేదన !

అన్నాడీఎంకే పార్టీ, తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో చిన్నమ్మ శశికళతో భేటీ కావాలని నిర్ణయించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ, తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో చిన్నమ్మ శశికళతో భేటీ కావాలని నిర్ణయించారు.

అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్ !అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్ !

కొడుగులోని రిసార్ట్ లో బసచేసిన దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు బుధవారం బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను కలిసి వారి గోడు వినిపించడానికి సిద్దం అవుతున్నారు. ఇన్ని రోజులు పుదుచ్చేరి, కొడుగు రిసార్ట్ లో రాజకీయం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఇక ఇంటికి వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది.

Disqualified AIADMK MLAs to meet Sasikala in Bangalore jail

18 మంది ఎమ్మెల్యేలు ఒకే సారి శశికళను చూడటానికి జైలు అధికారులు అవకాశం ఇస్తారా ? లేదా ? అనే విషయం వేచి చూడాలి. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చుతానని ఎగిరెగిరిపడిన టీటీవీ దినకరన్ ను నమ్ముకుని తాము రోడ్డున పడ్డామని కొందరు ఎమ్మెల్యేలు ఆయన ముఖ్య అనుచరుడు తంగ తమిళ్ సెల్వన్ మీద మండిపడుతున్నారని తెలిసింది.

హైకోర్టును ఆశ్రయించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు: దొడ్డిదారిలో సీఎం బలపరీక్ష !హైకోర్టును ఆశ్రయించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు: దొడ్డిదారిలో సీఎం బలపరీక్ష !

మొత్తం మీద రిసార్ట్ రాజకీయాలు చేసిన కొందరు ఎమ్మెల్యేలు చెన్నై చేరుకున్న వెంటనే ఎడప్పాడి పళనిసామి వర్గంలో చేరిపోతారని సమాచారం. అదే జరిగితే ఆ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Disqualified AIADMK MLAs to meet Sasikala in Bangalore jail on wendsday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X