బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయోమయంలో అనర్హత ఎమ్మెల్యేలు, మా పని అంతేనా, ఛలో ఢిల్లీ, రెబల్స్ దెబ్బ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉప ఎన్నికల్లో తమకు టిక్కెట్లు రావని ఆందోళనకు గురైన కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీలో టిక్కెట్లు ఇవ్వడానికి అదే పార్టీలోని నేతలు అభ్యంతరం చెప్పడం, సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండటంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న అనర్హత ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెలుతున్నారు.

అయోధ్య తీర్పు: దేవాలయంలో సతీమణితో కలిసి పూజలు చేసిన సీజేఐ, వీడియో వైరల్!అయోధ్య తీర్పు: దేవాలయంలో సతీమణితో కలిసి పూజలు చేసిన సీజేఐ, వీడియో వైరల్!

కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. ఇప్పటికే సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ పూర్తి అయ్యింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టులో తీర్పు వెలువడనుంది.

Disqualified MLAs of Karnataka to visit New Delhi today

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ బుధవారం ఉదయం అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ తీర్పు చెప్పనుంది. కర్ణాటకలోని అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు సుప్రీం కోర్టు తీర్పు మీద ఆదారపడి ఉంది.

బాలా సాహెబ్ ఠాక్రే ఏం చెప్పారు, శివసేన ఏం చేస్తోంది, టైగర్ మాటంటే విలువలేదా?!బాలా సాహెబ్ ఠాక్రే ఏం చెప్పారు, శివసేన ఏం చేస్తోంది, టైగర్ మాటంటే విలువలేదా?!

అనర్హత ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును బట్టి కర్ణాటక రాజకీయాలు ముఖచిత్రం మారనుంది. ఇప్పటిటకే కర్ణాటకలోని 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించారు. 15 నియోజక వర్గాల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉంది.

ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తమకు అవకాశం రాకపోతే తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలని అనర్హత ఎమ్మెల్యేలు నిర్ణయించారని తెలిసింది. బెంగళూరు నగరంలోని నాలుగు శాసన సభ నియోజక వర్గాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉంది.

English summary
Bengaluru: Ahead of the supreme court verdict on November 13, 2019 disqualified MLA's of Karnataka to visit New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X