న్యూ ఇయర్ గిఫ్ట్..ఆ పబ్‌కు వచ్చే వారికి కండోమ్‌లతో పాటు అది కూడా ఫ్రీ

నూతన సంవత్సరం అంటే కేవలం ఒక కొత్త తేదీ మాత్రమే కాదు. అది గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో ముందుకు సాగేందుకు మనకు ఒక అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ సంప్రదాయాలతో, విధానాలతో ఈ రోజును జరుపుకుంటారు.మన దేశంలో కూడా యూత్ నూతన సంవత్సర వేడుకలకు రెడీ అవుతోంది. పార్టీలు చేసుకోవడానికి యువత సిద్ధం అవుతోంది. యూత్‌ను ఆకట్టుకోవడానికి రకరకాల ఈవెంట్స్ పేరుతో పబ్‌ల యాజమానులు ముందుకొస్తున్నారు .

ఓ పబ్ నూతన సంవత్సర వేడుకులను వినుత్నంగా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. తమ పబ్‌కు వచ్చే ఆహ్వానితులకు కండోమ్‌లు ఇవ్వాలని డిసైడ్ అయింది. కండోమ్‌లతో పాటు, ఎనర్జీ కోసం ఓఆర్‌ఎస్‌లను ఇవ్వడానికి పూణేలోని ఓ పబ్ యాజమాన్యం నిర్ణయించింది. దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ కూడా చేసింది. అయితే ఈ న్యూ ఇయర్ ఈ పార్టీకి ఆహ్వానితులకు కండోమ్‌లు మరియు ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లను పంపిణీ చేయడంపై తీవ్ర వివాదం రేగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్యపై తీవ్ర విమర్శలకు గురైంది.

Distributing condoms as New Year gift in Pune

ఈ వార్త వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై పబ్ యజమానుల వాదన మరోలా ఉంది. పబ్ యజమానులు కండోమ్‌లు పంపిణీ చేయడం నేరం కాదని వారంటున్నారు. కండోమ్‌లను పంపిణీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం సేఫ్ సెక్స్‌ను ప్రోత్సహించడమే అని పబ్ యాజమానులు వాదిస్తున్నారు. మొత్తానికి తమ పబ్‌కు వచ్చిన వారికి కండోమ్‌‌లు ఇవ్వాలనే ఆలోచన వచ్చిన యాజమాన్యానికి నెటిజన్లు హ్యాట్సాష్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+