వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియా ఇంచార్జ్‌గా రాజీనామా: గురువారం వెళ్తున్నా... రమ్య ఏం చెప్పారంటే?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ ఇంచార్జ్ పదవికి దివ్య స్పందన (రమ్య) బుధవారం రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోడంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది. కానీ ఈ ఊహాగానాలకు ఆమె తెరదించారు.

తాను రాజీనామా చేస్తున్నానంటూ వచ్చినవి అన్నీ పుకార్లేనని చెప్పారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారేశారు. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానని, గురువారం కార్యాలయానికి వెళ్తానని చెప్పారు.

Divya Spandana rubbishes reports of quitting Congress social media cell

రాఫెల్ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ దొంగ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఓ ఫొటోను కూడా దానికి జతచేశారు. దీంతో యూపీలోని లక్నోకు చెందిన సయ్యద్ రిజ్వాన్ అనే న్యాయవాది ఆమెపై ఫిర్యాదు చేశారు.

ఆమె ట్వీట్ దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, దేశ ధిక్కారం కిందకు వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారనే ప్రచారం సాగింది. ట్విట్టర్ ప్రొఫైల్‌లో చోటు చేసుకున్న మార్పు కారణంగా ఆమె రాజీనామా ప్రచారం సాగింది. అయితే బగ్ (సాంకేతిక లోపం) కారణంగా ఈ లోపం తలెత్తిందని ఆమె తెలిపారు.

English summary
Speculations are rife that Divya Spandana, who took Congress' approach to social media to a new level altogether, may have relinquished her role as the party's social media head. An NDTV report says that Divya Spandana, popularly known as Ramya, may have irked the Congress' top brass by going overboard in her twitter tirade against Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X