వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎకో ఫ్రెండ్లీగా : గృహాలంకరణ, సహజ బహుమతుల వేడుకగా దీపావళి

|
Google Oneindia TeluguNews

దీపావళి అంటే దీపకాంతుల ఉత్సవం. అందరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. చీకటి నుండి వెలుగు వైపు పయనం సాగించడమే దీపావళి. అలాంటి దీపావళి పండుగ ఎకో ఫ్రెండ్లీ గా జరుపుకుంటే నిజంగానే వెలుగు వైపు మన జీవన ప్రయాణం సాగుతుంది. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి విషయాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి.

సహజసిద్ధమైన పూలు, వస్తువులు వినియోగం మేలు

సహజసిద్ధమైన పూలు, వస్తువులు వినియోగం మేలు

పండుగ వచ్చిందంటే చాలు సహజసిద్ధమైన పూలను, వస్తువులను వినియోగించడం మానేసి ఆర్టిఫిషియల్, ప్లాస్టిక్ పూలు, వస్తువుల కోసం పరుగులు పెడుతున్నారు. మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆర్టిఫిషల్ పూలు, పూల దండలు, ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులు గృహాలంకరణ కు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అలా కాకుండా ఈ సారి దీపావళి ఎకో ఫ్రెండ్లీ గా చేసుకుందాం. ప్లాస్టిక్ పూల కు బదులుగా గృహాలంకరణ బంతి, గులాబి, చామంతి వంటి పూలను వినియోగిస్తే బాగుంటుంది. పూలలో ఉండే పరిమళం మన ఇళ్లలోని హానికరమైన బాక్టీరియాను చంపటానికి ఉపయోగపడుతుంది.

కాలుష్యం తగ్గించే విధంగా పండుగ అలంకరణ

కాలుష్యం తగ్గించే విధంగా పండుగ అలంకరణ

అదేవిధంగా మామిడి తోరణాలతో ఇంటి అలంకరణ చేస్తే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవి కూడా మార్కెట్ లో ప్లాస్టిక్ వి దొరుకుతున్నాయి. కానీ నిజంగా మామిడాకులే పండుగ కళను తెచ్చిపెడతాయి. ఇక ఇంటి ముందు రసాయన రంగులతో ముగ్గులు వేయడం వల్ల కాలుష్యానికి ఎక్కువ అవకాశం ఉంటుంది .కాబట్టి బియ్యం పిండి, సహజసిద్ధమైన రంగులు, పప్పు ధాన్యాలను ఉపయోగించి రంగవల్లులు తీర్చిదిద్దితే చాలా అందంగా ఉంటుంది. ఇంకా బంతి పూలు, గులాబీలు వంటి పూలతో రంగవల్లులను అలంకరించినా ఇంటికి కొత్త అందం వస్తుంది.

దీపావళికి పర్యావరణానికి మేలు చేసే బహుమతులు

దీపావళికి పర్యావరణానికి మేలు చేసే బహుమతులు

దీపావళి పండుగలో ఉండే మరో మంచి పద్దతి ఆప్తులకు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం. ఈసారి మీ స్నేహితులు, బంధువులకు బహుమతులు ఇవాలి అనుకుంటే వారికి పూల మొక్కలు బహుమతులుగా ఇవ్వండి. మొక్కలను తీసుకొచ్చి, అందంగా అలంకరించి మీకిష్టమైనవారికి బహుమతిగా ఇవ్వండి. కొత్తగా ఉండటమే కాకుండా ఎప్పటికీ వారికి గుర్తుంటుంది. ఆ మొక్క పూలు పూసే ప్రతీ సారి వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు.

 ప్రకృతిని కాపాడటమే అసలైన దీపావళి

ప్రకృతిని కాపాడటమే అసలైన దీపావళి

వీటితోపాటు పర్యావరణానికి మేలు చేసే వస్తువులతో తయారు చేసిన వాటినే గిఫ్ట్ గా ఇవ్వటానికి ప్లాన్ చేసుకోండి. అలా ప్రకృతికి మేలు చేసే అవకాశముండే బహుమతులను మీరు ఎంచుకుంటే అది మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇలా ఎకో ఫ్రెండ్లీ అలంకరణతో , పర్యావరణానికి మేలు కలిగించే బహుమతులతో దీపావళి పండుగ జరుపు కోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేసి చూడండి . పర్యావరణ హిత దీపావళి నే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పెరుగుతున్న కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోటానికి చేసుకునే అసలైన దీపావళి .

English summary
Diwali should be celebrated without any hazard to nature, sound and environmental pollution. What you need to do is decorate the house with flowers like marie gold, rose etc. never use artificial flowers and toranas for decoration of the house. on the festive time celebrate this festival by giving gifts like natural flower plants and also environmet free gift articles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X