వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి బొనాంజా: మద్యం ప్రియులకు బంపర్ ఆఫర్.. హస్తినలో ఫారిన్ స్కాచ్‌పై తగ్గింపు..

|
Google Oneindia TeluguNews

మద్యం ప్రియులారా గుడ్‌న్యూస్. దీపావళి పండగ సందర్భంగా విదేశీ స్కాచ్‌ ధరలు తగ్గించారు. ఎక్కడో తెలుసా.. దేశ రాజధాని ఢిల్లీలో.. దీంతో మద్యం ప్రియులు స్కాచ్, వైన్ కోసం బారులు తీరనున్నారు. సోమవారం నుంచి తగ్గింపు అమల్లోకి వస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. దేశ రాజధాని పరిసరాల్లో మాత్రమే విదేశీ స్కాచ్ ధరపై తగ్గింపు ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో మాత్రం తేడా ఉండదని.. ఎంఆర్పీ ప్రకారం ధరలు అందుబాటులో ఉంటాయని స్పష్టంచేశాయి.

జగన్ అనే నేను అంటూ కోతలరాయుడు: ఇంత మాయ చేస్తారు కాబట్టే ఏ-1గా: లోకేశ్ సెటైర్లు..!జగన్ అనే నేను అంటూ కోతలరాయుడు: ఇంత మాయ చేస్తారు కాబట్టే ఏ-1గా: లోకేశ్ సెటైర్లు..!

ఈ లిక్కర్‌పై..

ఈ లిక్కర్‌పై..

ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో మాత్రం విదేశీ మద్యంపై తగ్గింపు ధరలు ఉంటాయి. చివాస్ రిగాల్, అబ్‌సోల్ట్, బాల్లాన్టినెస్ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఢిల్లీ, గుర్గావ్‌లో విదేశీ మద్యం అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించేందుకే చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనికితోడు దీపావళి కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు. మరోవైపు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినందున కూడా ఆఫర్ ప్రకటించడానికి కారణమైందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇవీ కొత్త ధరల వివరాలు..

ఇవీ కొత్త ధరల వివరాలు..

ఢిల్లీలో దీపావళి సందర్భంగా అబ్‌సోల్ట్ వోడ్కా రూ.1400కు విక్రయిస్తారు. 750 మిల్లీ లీటర్ల బాటిల్ అసలు ధర రూ.1800.. కాగా పండగ సందర్భంగా రూ.400 చొప్పున తగ్గించారు. అయితే ఇదే మందు బాటిల్ యూపీలో మాత్రం రూ.2450 ఉండటం విశేషం. బాలంటైన్స్ ఫైన్ మందు బాటిల్ రూ.1350కి విక్రయిస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం రూ.2 వేలకు విక్రయిస్తున్నారు.

చివాస్ రిగాల్ బాటిల్ రూ.2800

చివాస్ రిగాల్ బాటిల్ రూ.2800

ఇక చివాస్ రిగాల్ 12 ఏళ్ల ఓల్డ్ మబాలిట్ ఢిల్లీలో రూ.2800 లభించనుంది. ఇదే మందు బాటిల్ యూపీలో మాత్రం వెయ్యి రూపాయలు ఎక్కువకు విక్రయిస్తున్నారు. జానీ వాకర్ రెడ్ లెబల్ ఢిల్లీలో రూ.1350 ఉండగా యూపీలో 2300కు సేల్ అవుతుంది. బ్లాక్ లేబుల్ ఢిల్లీలో రూ.2500 లభిస్తోండగా.. యూపీలో మాత్రం 3800కు అమ్ముడుపోతోంది.

ఇదీ విషయం

ఇదీ విషయం

కొత్త వైన్ షాపులకు టెండర్లు మొదలవడంతో.. ధరల తగ్గించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కానీ యూపీలో మాత్రం ధరల మార్పుల్లో తేడా ఉండదని తేల్చిచెప్పారు. సాధారణంగా ప్రతీ ఏటా ఏప్రిల్‌లో ఆల్కహాల్ ధరలు అమల్లోకి వస్తాయి. కానీ ఈసారి దేశ రాజధానిలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం నుంచి తగ్గింపు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

English summary
foreign liquor brands like Absolut, Chivas Regal 12 YO, Ballantines's Finest are set to be available in cheaper prices in the national capital from Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X