వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోరెన్సిక్ నివేదిక కోసం సిబిఐ: రవి భార్యకు సమన్లు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీబీఐ అధికారులు ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానస్పద మృతి కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. చెన్నయ్ సీబీఐ డిఐజి సెల్వరాజ్ సెంగత్తీర్, ప్రతేక విభాగం ఎస్పీ శరవణన్ నేతృత్వంలోని 8 మంది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తున్నామని రాష్ట్ర పభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. కేంద్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చెన్నయ్ సీబీఐ అధికారులకు అప్పగించారు. చెన్నయ్ అధికారులు కేసు నమోదు చేసిన తరువాత బెంగళూరు చేరుకున్నారని సీబీఐ విభాగం సీనియర్ అధికారి రూప్ కుమార్ దత్త తెలిపారు.

రవి మృతదేహనికి పోస్టుమార్టుం నిర్వహించారు. అదే విధంగా రవి శరీరంలోని వివిద సున్నితమైన భాగాలలో స్యాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబరేటరికి పంపించారు. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. చెన్నయ్ సీబీఐ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదరు చూస్తున్నారు.

 dk ravi case: cbi seeks postmartum report

వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వాలని సీబీఐ అధికారులు వైద్యులకు చెప్పారు. విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన ఫోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. సీఐడి అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించారు. రవి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు సీబీఐ అధికారుల ఆధీనంలో ఉన్నాయి.

రవి భార్య కుసుతో పాటు వారి కుటుంబ సభ్యులకు, ఈ కేసులోని సాక్షులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాము పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు. రవి చనిపోతే ఎవరికి లాభం, ఆత్మహత్య లేదా హత్య వెనుక ఉద్దేశం ఏమిటి అని సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

కేసు విచారణలో భాగంగా బెంగళూరులోని సీబీఐ అధికారుల సహకారం తీసుకుంటున్నామని చెన్నయ్ అధికారులు చెప్పారు. అయితే కేసు దర్యాప్తులో మీరు జోక్యం చేసుకొరాదని బెంగళూరు సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

English summary
A team of the Central Bureau of Investigation led will leave for Bangalore to probe the D K Ravi death case. The team would comprise DIG Senkathir and SP of the Special Branch Sarvanan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X