వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ చిక్కులో పడ్డారు. విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!

డీకే సన్నిహితురాలు

డీకే సన్నిహితురాలు

బెళగావి గ్రామీణ ఎమ్మెల్యే లక్షీ హెబ్బాళ్కర్ డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెళగావి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి లక్ష్మీ హెబ్బాళ్కర్ డీకే. శివకుమార్ సహకారం తీసుకున్నారు.

డీకే దెబ్బకు !

డీకే దెబ్బకు !

సెప్టెంబర్ 14వ తేదీ విచారణకు హాజరుకావాలని లక్ష్మీ హెబ్బాళ్కర్ కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో తాను 14వ తేదీ హాజరుకాలేనని లక్ష్మీ హెబ్బాళ్కర్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం హాజరు కావాలని ఈడీ అధికారులు లక్ష్మీ హెబ్బాళ్కర్ కు మరోసారి సమన్లు జారీ చేశారు.

లక్ష్మీ ఏం చెప్పారంటే ?

లక్ష్మీ ఏం చెప్పారంటే ?

సెప్టెంబర్ 17వ తేదీ మీ ముందు హాజరుకాలేనని, 18వ తేదీ హాజరు అవుతానని లక్ష్మీ హెబ్బాళ్కర్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సరే అదే రోజు కచ్చితంగా మాముందు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ ఫ్లాట్ లో ?

ఢిల్లీ ఫ్లాట్ లో ?

ఢిల్లీలోని డీకే. శివకుమార్ ఫ్లాట్ రూ. 8.69 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు డీకే. శివకుమార్ సరైన సమాధానం చెప్పడం లేదని ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇదే కేసులో అరెస్టు అయిన డీకే. శివకుమార్ బెయిల్ అర్జీ పిటిషన్ విచారణ ఇదే నెల 18వ తేదీకి వాయిదా పడింది.

317 బ్యాంకు అకౌంట్లు

317 బ్యాంకు అకౌంట్లు

ఢిల్లీలోని డీకే. శివకుమార్ ఫ్లాట్ లో చిక్కిన రూ. 8.69 కోట్ల కంటే రూ. 200 కోట్లకు పైగా అక్రమంగా నగదు లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. డీకే. శివకుమార్ చాల అక్రమలావాదేవీలు జరిగాయని 317 బ్యాంకు అకౌంట్లు సమాచారం మాకు చిక్కడం లేదని, చాలా బినామీ పేర్లతో ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

English summary
PMLA Case: DK Shivakumar aide Belagavi rural MLA Lakshmi Hebbalkar gets ED summons on Tuesday(Sept 17) to appear before Delhi ED office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X