వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, బెయిల్ ఇవ్వలేం, తేల్చి చెప్పిన కోర్టు, తీహార్ జైల్లో!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన అభిమానులు షాక్ కు గురైనారు.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల మకాం, పేలుడు పదార్థాలు సీజ్, ఐటీ!బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల మకాం, పేలుడు పదార్థాలు సీజ్, ఐటీ!

ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం మాజీ మంత్రి డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వరాదని ఈడీ అధికారులు కోర్టులో మనవి చేశారు. మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు తాము బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఒకే వ్యాఖ్యంతో తీర్పు చెప్పారు.

DK Shivakumar Bail application rejected by the court.

నాలుగు రోజుల పాటు మాజీ మంత్రి డీకే శివకుమార్ ను విచారణ చేసిన ఈడీ అధికారులు సెప్టెంబర్ 3వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి 10 రోజులకు పైగా డీకే. శివకుమార్ ను విచారణ చేసిన అధికారులు న్యాయస్థానం ఆదేశాలతో ఆయన్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు.

మాజీ మంత్రి డీకే. శివకుమార్ తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు బెయిల్ ఇస్తే ఆయన సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. డీకే. శివకుమార్ కు బెయిల్ రాకపోవడంతో ఆయన అభిమానులు నిరాశకు గురైనారు.

English summary
Karnataka fomer minister DK Shivakumar bail application verdict in enforcement directorate special court. Bail application rejected by the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X