వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక కాంగ్రెస్ హీరోకు కీలక పదవులు, హైకమాండ్ నిర్ణయం, ఆపద్బాంధవుడు, కష్టకాలంలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని మూడు సార్లు ఆపద్బాంధవుడిగా ఆదుకున్న ఆ రాష్ట్ర మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ హీరోగా పేరు తెచ్చుకున్న డీకే శివకుమార్ సేవలు గుర్తించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టీ నాయకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

కేపీసీసీ అధ్యక్షుడు

కేపీసీసీ అధ్యక్షుడు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో కీలకపాత్ర పోషించిన ఆ రాష్ట్ర మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు ఆ పార్టీ హైకమాండ్ భారీ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. కేపీసీ అధ్యక్ష పదవిని డీకే. శివకుమార్ కు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని సమాచారం.

దమ్మున్న లీడర్

దమ్మున్న లీడర్


కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల నాయకులను కలుపుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దమ్మున్న నాయకుడు డీకే. శివకుమార్ అని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని సమాచారం. అందుకే డీకే. శివకుమార్ కు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

గుజరాత్ దెబ్బ

గుజరాత్ దెబ్బ

2017 గుజరాత్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో డీకే. శివకుమార్ కీలకపాత్రపోషించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకు వచ్చిన డీకే శివకుమార్ బిడిది సమీపంలోని ది గాల్ఫ్ రిసార్టులో వారికి భద్రత కల్పించి వారు బీజేపీ వైపు జారిపోకుండా చూసుకున్నారు.

ఐటీ దాడులు

ఐటీ దాడులు

ఐటీ దాడులు జరిగినా లెక్కచెయ్యకుండా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహమ్మద్ పటేల్ ను గెలిపించడంలో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. గుజరాత్ దిన పత్రికలు సైతం డీకే. శివకుమార్ కాంగ్రెస్ హీరో అంటూ అప్పట్లో వార్తలు ప్రచురించాయి.

డీకేకి రెండు పదవులు

డీకేకి రెండు పదవులు

కేపీసీసీ అధ్యక్ష పదవితో పాటు డీకే శివకుమార్ కు విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిదని సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తరువాత 78 మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా డీకే. శివకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారని, జేడీఎస్ తో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి కారణం అయ్యారని, అందుకే ఆయనకు రెండు పదవులు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది.

English summary
Karnataka election results 2018: Is Congress highcommand thinking to give KPCC president post and a cabinet minister post to D K Shivakumar? Some sources said, Congress highcommand is very much happy about his performance in managing situations during Karnataka election results 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X