వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగింటి ఆడపడుచు సుమలతతో చర్చలు, ఎంపీగా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం, త్రిబుల్ షూటర్ ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాను అంటున్న స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణితో తాము మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని త్రిబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అన్నారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి డీకే. శివకుమార్ మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎవరు పోటీ చెయ్యాలి అనే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగిందని అన్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ఎంపీ అయ్యారని మంత్రి డీకే. శివకుమార్ గుర్తు చేశారు.

 DK Shivakumar said we will convinse Sumalatha Ambareesh not to contest to Lok Sabha elections from Mandya.

సుమలత అంబరీష్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యి కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని మనవి చేశారని మంత్రి డీకే. శివకుమార్ వివరించారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం టిక్కెట్ జేడీఎస్ కు ఇవ్వాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి డీకే. శివకుమార్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ టిక్కెట్ తనకు ఇవ్వకపోతే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని సుమలత చెప్పడంతో సంకీర్ణ ప్రభుత్వంలో చర్చ మొదలైయ్యిందని, ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి డీకే. శివకుమార్ మీడియాకు చెప్పారు.

 DK Shivakumar said we will convinse Sumalatha Ambareesh not to contest to Lok Sabha elections from Mandya.

దివంగత రెబల్ స్టార్ అంబరీష్ కుటుంభానికి మంత్రి డీకే. శివకుమార్ అత్యంత సన్నిహితుడు. సుమలత మనసు మార్చడానికి మంత్రి డీకే. శివకుమార్ సరైన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకే సుమలతో చర్చలు జరపడానికి మంత్రి డీకే. శివకుమార్ కు ఆ భాద్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం.

English summary
DK Shivakumar said we will convinse Sumalatha Ambareesh not to contest to Lok Sabha elections from Mandya. He said Mandya we have anouther plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X