వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు డీఎండీంకే అత్యవసర భేటీ .. లోక్ సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామన్న అన్నాడీఎంకే

|
Google Oneindia TeluguNews

చెన్నై : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొన్న డీఎండీకే .. లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం అన్నాడీఎంకే పార్టీనీ డీఎండీకే తమకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అడగడమే. లోక్ సభ సీట్ల విషయంలో రాజీకి ఓకే కానీ .. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అన్నాడీఎంకే సుతారము ఇష్టపడటం లేదు. దీంతో రేపు (మంగళవారం) డీఎండీకే అత్యవసర సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత విజయ్ కాంత్ నిర్ణయించారు.

రేపు డీఎండీకే అత్యవసర భేటీ

రేపు డీఎండీకే అత్యవసర భేటీ

మంగళవారం చెన్నైలో డీఎండీకే ఆఫీస్ బేరర్ల సమావేశం జరగనుంది. పార్టీ అధినేత విజయ్ కాంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో చర్చించే అంశానికి సంబంధించి అజెండా లేదని స్పష్టంచేశాయి. బుధవారం తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటిస్తారు. సరిగ్గా ప్రధాని పర్యటనకు ఒక్కరోజు ముందు డీఎండీకే అత్యవసర సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 కలిసే పోటీ చేస్తాం ..

కలిసే పోటీ చేస్తాం ..

బుధవారం తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అంతకుముందే డీఎండీకే ఇతర పార్టీలు తామంతా కలిసే పోటీ చేస్తామని అన్నాడీఎంకే స్పష్టంచేస్తోంది. రాష్గ్రంలో అన్నాడీఎంకే డీఎండీకే కలిసే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోందని .. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని అన్నాడీఎంకే నేత డీ జయకుమార్ స్పష్టంచేశారు.

నీరు, నూనె కలిసి పనిచేస్తాం

నీరు, నూనె కలిసి పనిచేస్తాం

ఈ రెండు పార్టీల మధ్య తేడా రాజ్యసభ సీటు విషయంలో ఏర్పడింది. విజయ్ కాంత్ తమకు ఒక్క రాజ్యసీటు ఇవ్వాలని కోరగా .. అందుకు అన్నాడీఎంకే అంగీకరించలేదు. కావాలంటే లోక్ సభ సీట్లు ఎక్కువ ఇస్తామని సంకేతాలు ఇచ్చింది. దీంతో నొచ్చుకున్న విజయ్ కాంత్ డీఎంకేతో ముందుకుసాగాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల డీఎంకే చీఫ్ స్టాలిన్ విజయ్ కాంత్ తో చర్చలు జరుపడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు రంగంలోకి దిగారు. డీఎండీకే, అన్నాడీఎంకే నీరు, నూనె లాంటివని ఉదహరించారు రెవెన్యూ మంత్రి ఆర్ బీ ఉదయ్ కుమార్. వివిధ అంశాలపై తమ మధ్య చర్చలు జరుగుతున్నాయని .. సుహృద్భావ వాతావరణంలో సీట్ల కేటాయింపు ఉంటుందని .. తమ మధ్య నెలకొన్న స్పర్థలకు తెరపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
While the AIADMK remains hopeful of a tie-up with the DMDK for the Lok Sabha election, the latter has convened an emergency meeting of senior office-bearers in Chennai on Tuesday. It will be presided over by party leader Vijayakant. No agenda has been set for the meeting slated a day before Prime Minister Narendra Modi arrives to address a public rally on the Chennai outskirts on March 6, in which alliance party leaders will participate. The BJP is keen that the AIADMK finalises electoral pacts with all parties, including the DMDK, before the public meeting. On Sunday, senior AIADMK leader D. Jayakumar said that there need not be any doubt about a pact between the two.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X