వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత పరువు నష్టం దావా: కెప్టెన్‌కు కోర్టు సమన్లు జారీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరపున దాఖలైన పరువునష్టం దావాలో డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 13న జరిగే విచారణ సందర్బంగా కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

<strong>జయ మృతి: ఆ డీఎస్పీ ఎవరు ? 30 గంటలు ఆలస్యం, బాంబు పేల్చేరు</strong>జయ మృతి: ఆ డీఎస్పీ ఎవరు ? 30 గంటలు ఆలస్యం, బాంబు పేల్చేరు

తమిళనాడులోని విరుదునగర్ సమీపంలో జరిగిన డీఎండీకే పార్టీ సమావేశంలో విజయ్ కాంత్ మాట్లాడుతూ అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి.

DMDK chief Vijayakanth makes disparaging comments against J. Jayalalithaa

విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలు జయలలిత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వాన్ని చులకనగా మాట్లాడారంటూ తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీవిల్లి పుత్తూరు కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు మార్చి 2వ తేది గురువారం విజయ్ కాంత్ హాజరుకావాల్సి ఉంది.

<strong>షాక్: 50 మంది డీఎంకే ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి జంప్ ! రాజేంద్ర బాలాజీ</strong>షాక్: 50 మంది డీఎంకే ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి జంప్ ! రాజేంద్ర బాలాజీ

అయితే విజయ్ కాంత్ పార్టీ తరపున జిల్లాల వారీగా పర్యటన చేస్తుండటంతో కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఈ సందర్బంలో న్యాయమూర్తి కేసు ఏప్రిల్ 13వ తేదికి వాయిదా వేశారు. ఆ రోజు విజయ్ కాంత్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తు సమన్లు జారీ చేశారు. విజయ్ కాంత్ హాజరుకాని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

English summary
DMDK chief Vijayakanth was answering a question posed by a reporter and used derogatory language against J. Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X