వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూనకంతో సొంత పార్టీ నాయుడిపై క్యాప్టెన్ విజయ్ కాంత్ దాడి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో నిత్యం సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల మీద మండిపడి దాడి చేసే క్యాప్టెన్ విజయ్ కాంత్ మళ్లీ సంచలనానికి తెరతీశారు. కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్లిన విజయ్ కాంత్ సొంత పార్టీ నాయకుడి మీద దాడి చేసి అక్కడున్న కార్యకర్తలకు షాక్ ఇచ్చారు.

విలుప్పురం సమీపంలోని పర్నూట్టి ప్రాంతంలో విజయ్ కాంత్ పూనకంతో ఊగిపోయారు. పర్నూట్టిలో మంగళవారం ఏర్పాటు చేసిన 'ఉంగకలదన్ నాన్ 'అనే కార్యక్రమానికి హాజరైయ్యేందుకు డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ బయలుదేరారు.

తమ పార్టీ నాయకుడు, సినీనటుడు విజయ్ కాంత్ కు స్వాగతం పలకడానికి డీఎండీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఆ సమయంలో ఓ నాయకుడు విజయ్ కాంత్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అంతే విజయ్ కాంత్ కు మండిపోయింది.

DMDK leader Vijayakanth beaten his cadre in Panrutti

ఆ నాయకుడు చెంప చెల్లుమనిపించిన విజయ్ కాంత్ పూనకంతో ఊగిపోయారు. విజయ్ కాంత్ నాయకుడి చెంప పగలగొట్టడంతో అక్కడ ఉన్న డీఎండీకే పార్టీ కార్యకర్తలు షాక్ కు గురైనారు. గతంలో విజయ్ కాంత్ క్రిష్ణగిరి జిల్లాలో శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేశారు. ఆ

ఆ సందర్బంలో విజయ్ కాంత్ బహిరంగ సభలోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న డీఎండీకే పార్టీ నాయకుడి చెంప పగలగొట్టారు. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో విజయ్ కాంత్ సొంత పార్టీ నాయకులను కొట్టిన సందర్బాలు చాలనే ఉన్నాయి.

English summary
DMDK leader Vijayakanth beaten his cadre in Panrutti when they took part in 'Ungkaludan nan' program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X