వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో అధికార పార్టీకి షాక్, స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా, జయలలిత, కరుణ లేని లోటు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ (అన్నాడీఎంకే), ప్రతిపక్ష పార్టీ (డీఎంకే)ల మధ్య నువ్వా...నేనా ? అన్నట్లుగా సాగిన ఫలితాల లెక్కింపు పూర్తి అయ్యింది. అధికార పార్టీ అన్నాడీఎంకేకి సినిమా చూపించిన ప్రతిపక్ష డీఎంకే పార్టీల కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో తనసత్తా చాటుకుంది. మొత్తం 91,975 పదవులకు జరిగిన ఎన్నికల్లో 18,850 పదవులు ఏకగ్రీవం కాగా మిగిలిన 73, 405 పదవులకు 2, 31, 890 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధి లేని స్పష్టంగా కనపడింది.

అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!

 జయలలిత, కరుణానిధి లేని లోటు!

జయలలిత, కరుణానిధి లేని లోటు!

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత (ఏఐఏడీఎంకే), మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (డీఎంకే) మరణించిన తరువాత ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. జయలలిత, కరుణానిధి వారుసులుగా రెండు పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చివరి వరకు నువ్వా నేనా అంటూ బరిలో నిలిచారు. అయితే జయలలిత, కరుణానిధి లేని లోటు తీర్చడానికి ఆ పార్టీల రాజకీయ వారసులు ఈ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పని చేశారు.

2.30 లక్షల మంది పోటి !

2.30 లక్షల మంది పోటి !

తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా వార్డులు, యూనియన్ వార్డులో గత నెల (డిసెంబర్ 2019) 27, 30వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నిల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 91, 975 పదవులకు జరిగిన పోటీల్లో 18, 850 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మిగిలిన 73, 405 పదవులకు 2, 31, 890 మంది పోటీ చేశారు.

శుక్రవారం శుభముహూర్తం

శుక్రవారం శుభముహూర్తం

జనవరి 2వ తేదీ గురువారం ఉదయం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. శుక్రవారం 3వ తేదీ ఉదయం సుమారు 10.45 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. అర్దరాత్రి నుంచి జిల్లా వార్డులు, యూనియన్ వార్డుల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అంటూ పోటీ పడటంతో ఉత్కంఠ మొదలైయ్యింది.

ఎన్నికల్లో డీఎంకే హవా

ఎన్నికల్లో డీఎంకే హవా

తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు తనసత్తా చూటుకున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీకి సినిమా చూపించిన డీఎంకే పార్టీ అభ్యర్థులు అనేక వార్డులో విజయం సాధించారు. డీఎంకే హవాతో అధికార అన్నాడీఎంకే పార్టీ నాయకులు కంగుతిన్నారు.

ఇదే స్థాలిన్ సత్తా

ఇదే స్థాలిన్ సత్తా

డీఎంకే పార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నాయకుడు టీఆర్ బాలు శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ మీద ప్రశంసలు కురిపించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ఎంకే. స్టాలిన్ ఎన్నికల కమిషన్ ను రెండుసార్లు కలిసి ఫిర్యాదు చేశారని టీఆర్ బాలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంకే. స్టాలిన్ నిరంతరం శ్రమించారని, దాని ఫలితం నేడు విడుదలైయ్యిందని టీఆర్ బాలు చెప్పారు.

కుట్ర జరుగుతోంది?

కుట్ర జరుగుతోంది?

రామనాథపురం, కరూర్ తదితర ప్రాంతాల్లో డీఎంకే అభ్యర్థులు విజయం సాధించినా ఇంత వరకూ ఎన్నికల కమిషన్ అధికారులు విజేతల పేర్లు ప్రకటించలేదని, ఇది చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం కలుగుతోందని టీఆర్ బాలు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధికంటే పార్టీని నడిపించడంలో ఎంకే స్థాలిన్ 10 రెట్లు మేలని, ఆయన తన సత్తా చాటుకున్నారని టీఆర్ బాలు సంతోషం వ్యక్తం చేశారు.

English summary
DMK ahead of ruling AIADMK in rural boady polls in Tamil Nadu. Ruling AIADMK and Opposition DMK are in Neck and neck race in Tamilnadu Rural local body election results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X