వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క అక్షరం మారింది: చైనా వాల్ తో పోల్చాలని స్టాలిన్ పరువు తీశారు, వైరల్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ పరువును సొంత పార్టీ కార్యకర్తలు గంగలో కలిపేశారు. ఒక్క పొరపాటు స్టాలిన్ పేరు ప్రతిష్టలు దెబ్బతినే విధంగా చేశాయి.

తన పుట్టిన రోజు సందర్బంగా, తన పర్యటనల సందర్బంగా నా ఫోటోలు, పేర్లతో ఎక్కడా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు వెయ్యరాదని స్టాలిన్ డీఎంకే పార్టీ కార్యకర్తలకు పదేపదే మనవి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే స్టాలిన్ పుట్టిన రోజు సందర్బంగా ఎర్పాటు చేసిన పోస్టర్లు, ఫెక్సీలలో చిన్న పొరపాటు జరిగి ఆయన పరువు పోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పుట్టిన రోజు కోసం

పుట్టిన రోజు కోసం

ఇటీవల ఎంకే. స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలను డీఎంకే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు నిరాడంబరంగా జరుపుకున్నారు. స్టాలిక్ కు ఎంతో ఇష్టం అయిన పుస్తకాలు కొందరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. జల్లికట్టు పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఓ అభిమాని ఏకంగా ఎద్దును బహుమతిగా ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు

ఇ బదులు ఈ రాసి పరువు తీసేశారు

ఇ బదులు ఈ రాసి పరువు తీసేశారు

తమిళంలో ఇన అంటే ప్రజలు, రాష్ట్రాన్ని, కార్యకర్తలను రక్షించేవాడు అని అర్థం. ఈన అంటే క్రూరమైన నేరాలు, సమాజ ద్రోహి, తదితర నేరస్లులను పిలిచే పదం అని అర్థం. అయితే ఓ కార్యకర్త అత్యుత్సహాం చూపించి స్టాలిన్ పరువు తీశాడు.

చైనా వాల్ తో పోల్చాలని ప్రయత్నించి

చైనా వాల్ తో పోల్చాలని ప్రయత్నించి

తిరువళ్లూరు జిల్లాలోని తిరుక్కాడం పట్టణంలో సిమ్ సోమ్ అనే డీఎంకే పార్టీ నాయకుడు మీరు చైనా వాల్ లాగా డీఎంకే పార్టీని, తమిళ ప్రజలకు కాపాడాలని స్టాలిన్ ను ఆకాశానికి ఎత్తేయాలని అనుకున్నాడు. అయితే ఇన బదలుగా ఈన అని రాసేసి పోస్టర్లు, పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇన బదులు ఈన అని రాయడంతో మీరు చైనా వాల్ లాగా పెద్ద వెదవ అంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెయ్యడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రివర్స్ కావడంతో

రివర్స్ కావడంతో

సిమ్ సోమ్ అనే డీఎంకే నాయకుడు స్టాలిన్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఆయన ఫోటో కూడా వేసుకున్నారు. సిమ్ సోమ్ పేరు పక్కన ఎంఏ అని వేసుకోవడంతో డిగ్రీ చదివిన వ్యక్తి ఓ ప్రముఖుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ముద్రించకు ముందే కనీసం అక్షరాలు ఎలా ఉన్నాయో అని ఫ్రూఫ్ చూసుకునే విషయం తెలియదా ? అంటు డీఎంకే నాయకులు మండిపడుతున్నారు.

ఫ్లెక్సీలు తొలగించినా, అక్కడ మాత్రం నో చాన్స్

ఫ్లెక్సీలు తొలగించినా, అక్కడ మాత్రం నో చాన్స్

విషయం తెలుసున్న డీఎంకే నాయకులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సిమ్ సోమ్ ఖంగుతిని ఫ్లెక్సీలు, పోస్టర్లులు తొలగించారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఎవరో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అది వైరల్ అయ్యింది. అవును స్టాలిన్ కు ఇప్పుడు చైనా వాల్ అంత పరువు పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

English summary
DMK cadre stuck poster on the wall to wish Stalin’s birthday. But absurd spelling mistake in the poster, which insulted M K Stalin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X