వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్ కు డిఎంకె పగ్గాలు,అళగిరి ఓకే చెప్పారా,ద్రవిడ పార్టీల్లో కొత్త నాయకత్వాలు

డిఎంకె పార్టీ కీలకసమావేశం జనవరి నాలుగవ తేదిన జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :తమిళనాట రాజకీయాల్లో అధికార, విపక్ష పార్టీల్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. అధికార అన్నాడిఎంకె పార్టీలో శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. మరో వైపు ముఖ్యమంత్రి పదవిని కూడ ఆమె చేపట్టాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. విపక్ష డిఎంకె పార్టీలో కూడ నాయకత్వ మార్పు జరగనుంది. యువనాయకుడు స్టాలిన్ కు పార్టీ పగ్గాలను చేపట్టే అవకాశం ఉంది.ఈ మేరకు డిఎంకె పార్టీ సర్వసభ్య సమావేశం జనవరి నాలుగవతేదిన జరిగే అవకాశం ఉంది.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.అన్నా డిఎంకెతో పాటు డిఎంకె లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు డిఎంకె పార్టీ సర్వసభ్య సమావేశం జనవరి నాలుగవతేదిన జరగనుంది.

గత ఏడాది డిసెంబర్ 29వ, తేదినే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కరుణానిధి అనారోగ్యంతో ఆసుపత్రి పాలుకావడంతో ఈ సమావేశాన్ని వాయిదావేశారు. జనవరి నాలుగవ తేదిన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

డిఎంకె పార్టీ పగ్గాలు యువనాయకుడు స్టాలిన్ కు అప్పగించనున్నారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. డిఎంకె పార్టీలో దక్షిణ తమిళనాడు అళగిరి కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీ నుండి బహిష్కరణకు గురైన అళగిరికి పార్టీలో మంచి పదవి దక్కే అవకాశం కూడ లేకపోలేదు.

పార్టీ పగ్గాలు తీసుకోనున్న స్టాలిన్

పార్టీ పగ్గాలు తీసుకోనున్న స్టాలిన్

డిఎంకె పార్టీ యువనాయకుడు స్ఠాలిన్ కు పార్టీ పగ్గాలను అప్పగించనుంది. ఈ మేరకు జనవరి నాలుగవ తేదిన నిర్వహించే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.డిఎంకె చీఫ్ గా కరుణానిధి కొనసాగుతున్నారు.అయితే ఆయనను పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిస్తారా, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలా అనే దానిపై ఇంకా ఇంతకాలం తర్జన భర్జన సాగింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను స్టాలిన్ కు కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 కుటుంబసభ్యులు ఏమంటారు

కుటుంబసభ్యులు ఏమంటారు

డిఎంకె పార్టీ లో కీలకమైన పదవిని స్ఠాలిన్ కు కట్టబెడితే మిగిలినవారు ఏం చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే కరుణానిధి పెద్దకొడుకు గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దరిమిలా తమిళనాడులో అన్నా డిఎంకె పార్టీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం కూడ ఉంది.అయితే స్టాలిన్ తన రాజకీయ వారసుడని కరుణానిధి ఇప్పటికే ప్రకటించారు.అయితే పార్టీ పగ్గాలను కూడ స్టాలిన్ కే అప్పగించేందుకు ఆయన సిద్దమయ్యారు. తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో అళగిరికి పార్టీ పగ్గ్గాలను ఇచ్చే అవకాశం ఉంది. మరో వైపు కనిమొళికి కూడ పార్టీలో కీలకమైన పదవులు దక్కే అవకాశం ఉంది. దరిమిలా స్టాలిన్ పార్టీ కీలక భాద్యతలను చేపట్టేందుకు కుటుంబం నుండి ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు.

 కీలక నిర్ణయాలకు జనరల్ బాడీ అనుమతి అనివార్యం

కీలక నిర్ణయాలకు జనరల్ బాడీ అనుమతి అనివార్యం

పార్టీలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే జనరల్ బాడీ అనుమతి తప్పనిసరి ఉండాలి. పార్టీ జనరల్ బాడీ నిర్ణయం ప్రకారంగానే పార్టీలో మార్పులు,చేర్పులు గాని ఇతర నిర్ణయాలను గాని తీసుకోవాల్సి ఉంటుంది. దరిమిలా డిఎంకె జనరల్ బాడీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ కు పగ్గాలు ఇచ్చేందుకుగాను కరుణానిధి ఇప్పటికే సానుకూల సంకేతాలు ఇచ్చారు. దరిమిలా జనరల్ బాడీ సమావేశంలో స్టాలిన్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం లాంఛనమేననే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. అయితే కీలకమైన నిర్ణయాలు పార్టీ జనరల్ బాడీ సమావేశంలోనే తీసుకోవాల్సి ఉన్నందున జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

 శశికళను డీకొట్టనున్న స్టాలిన్

శశికళను డీకొట్టనున్న స్టాలిన్

అన్నాడిఎంకె పార్టీలో కూడ నాయకత్వ మార్పు చోటుచేసుకొంది. అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు.ముఖ్యమంత్రిగా కూడ ఆమె బాధ్యతలను చేపట్టాలని పార్టీ నాయకులు ఒత్తిడితెస్తున్నారు. సీనియర్లు కూడ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే డిఎంకె లో కూడ నాయకత్వ మార్పుకూడ ఖాయమైంది. స్టాలిన్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోనున్నారు.అయితే చిన్నమ్మ సిఎంగా పగ్గాలు చేపడితే ఇప్పటికే అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా స్టాలిన్ ఉన్నారు. శశికళనుధీటుగా ఎదుర్కోనున్నారుని డిఎంకె వర్గాలు భావిస్తున్నాయి.అయితే పార్టీకే చిన్నమ్మ పరిమితమైతే ఇప్పటికే రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న స్ఠాలిన్ ఆమెను ఢీకొట్టడం సులువేననే అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

 ఆళగిరి వైపే అందరి చూపు

ఆళగిరి వైపే అందరి చూపు

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి వైపు అందరూ చూస్తున్నారు. పార్టీ నుండి అళగిరి సస్పెన్షన్ కు గురయ్యాడు.అయితే గతంలో పార్టీ దక్షిణాది బాద్యతలను అళగిరి చేసేవారు.అయితే స్టాలిన్ ను తన రాజకీయవారసుడిగా కరుణానిధిగా ప్రకటించడంతో అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు.అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో అళగిరికి గతంలో ఉన్న బాద్యతలను తిరిగి ఇచ్చేందుకు కరుణ సానుకూలంగా ఉన్నారు. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని స్టాలిన్ కు నాయకత్వాన్ని ఇచ్చేందుకు అళగిరి పెద్దగా అడ్డు చెప్పే అవకాశాలు ఉండకపోవచ్చని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. బుదవారం నాటి సమావేశంలో అళగిరి తో పాటు ఆయన వర్గీయులు ఏం చేస్తారనే అంశంపై కొంత ఉత్కంఠ కూడ లేకపోలేదు.అయితే అళగిరి కూడ తన సోదరుడికి పార్టీ పగ్గాలు ఇచ్చే విషయమై కొంత సానుకూలంగానే ఉన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

English summary
dmk general body will be meet on january 4th 2017, stalin will be elected as party woriking president in general body meeting .familymembers agree to stalin as party working president said party workers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X