వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

35 ఏళ్ల తర్వాత ఆ పదవి నుంచి స్టాలిన్ తప్పుకున్నారు

1981లో ఎంకే స్టాలిన్ స్వయంగా డీఎంకే పార్టీ యూత్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ స్టాలిన్ యూత్ విభాగం కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తనకు ఎంతో ఇష్టం అయిన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గత మూడున్నర దశాబ్ధాలుగా డీఎంకే పార్టీ యూత్ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన స్టాలిన్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

<strong>రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా</strong>రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా

ఆస్థానానికి డీఎంకే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ సామినాథన్ కు కేటాయించారు. డీఎంకే పార్టీ కోశాధికారిగా ఉన్న ఎంకే స్టాలిన్ ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ చీఫ్ కరుణానిధి నియమించిన విషయం తెలిసిందే.

1981లో ఎంకే స్టాలిన్ స్వయంగా డీఎంకే పార్టీ యూత్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ స్టాలిన్ యూత్ విభాగం పదవి నుంచి తప్పుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం స్టాలిన్ మనసు మార్చుకున్నారు.

DMK gets new youth wing secretary following Stalin’s elevation

<strong>జయలలిత మేనకోడలు దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు</strong>జయలలిత మేనకోడలు దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు

డీఎంకే యూత్ విభాగం బాధ్యతలు స్పీకరించిన సామినాథన్ డీఎంకే పార్టీ చీఫ్ కురుణానిధిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. తనకు పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మూడు సార్లు శాసన సభ్యుడిగా నెగ్గిన సామినాథన్ కు పార్టీలో మంచిపట్టు ఉంది. తిర్పూరు జిల్లాలో అన్నాడీఎంకే పార్టీకి దీటుగా డీఎంకే పార్టీని అభివృద్ది చేస్తామని సామినాథన్ చెప్పారు. డీఎంకే పార్టీ జాయింట్ సెక్రటరీగా పార్టీ నేత చంద్రశేఖర్ ను నియమించారు.

English summary
DMK appointed a new chief for its Youth Wing in view of elevation of incumbent M K Stalin, who held the post for more than three decades, as the party Working President. DMK Genral Secretary K Anbalagan announced the appointment of former Minister M P Saminathan as the Youth Wing Secretary under relevant party rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X