చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Blackmail: శశికళ ఆత్మహత్య, ఐదేళ్లుగా నగ్న వీడియోలతో పొలిటికల్ లీడర్ టార్చర్, పెళ్లి కొడుకు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ చెంగల్పట్టు: సమీప బంధువు అయిన యువతి స్నానం చేస్తున్న సమయంలో పొలిటికల్ లీడర్, అతని బంధువు కలిసి మొబైల్ లో ఆమె నగ్న వీడియోలు తీసి ఐదు సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమె ఆత్మహత్య చేసుకుందని నమోదైన కేసులో ఆ యువ నాయకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. సొంత బంధువులే నగ్న వీడియోలు తీసి టార్చర్ చెయ్యడంతో మంచి ఉద్యోగం చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడం వలనే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని యువతి సోదరుడు ఫిర్యాదు చెయ్యడంతో తమిళనాడులో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసుల ముందు లొంగిపోయిన వ్యక్తిని, అతని బంధువును పార్టీ సభ్యత్వం నుంచి తొలగించామని డీఎంపీ పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ చెప్పారు.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 ప్రముఖ కంపెనీలో ఉద్యోగం

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా సెయ్యారు పట్టణంలోని నైనార్ కుప్పంలో నివాసం ఉంటున్న శశికళ (25) అనే యువతి చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న శశికళకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 డీఎంకే పార్టీ లీడర్స్, హత్య కేసు

డీఎంకే పార్టీ లీడర్స్, హత్య కేసు

శశికళ సమీప బంధువులు అయిన పురుషోత్తమన్ (25), దేవేంద్రన్ (27) అనే ఇద్దరు యువకులు డీఎంకే పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. పురుషోత్తమన్ చెంగల్పట్టు జిల్లా కార్యనిర్వహణ విభాగం నాయకుడిగా, దేవేంద్ర అదే పార్టీ లోకల్ లీడర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే పురుషోత్తమన్, దేవేంద్రల మీద హత్య కేసు నమోదు కావడంతో ఆ కేసు విచారణలో ఉంది.

 ఇంట్లో శవమైన శశికళ

ఇంట్లో శవమైన శశికళ

కరోనా వైరస్ దెబ్బతో చెన్నై, చెంగల్పట్టు జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా శశికళ ఉద్యోగం చేస్తున్న కంపెనీ తాత్కాలికంగా మూసివేయడంతో ఆమె చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నది. గత నెల (జూన్) 24వ తేదీన శశికళ కుటుంబ సభ్యులు అందరూ పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న శశికళ శవమైయ్యింది. తరువాత ఇంటికి వచ్చిన శశికళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో సెయ్యారు పోలీసులు కేసు నమోదు చేశారు.

 స్మశానంలో ధర్నా

స్మశానంలో ధర్నా

కేసు నమోదు చేసిన సెయ్యారు పోలీసులు శశికళ మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టుం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరుసటి రోజు శశికళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఆమె కుటుంబ సభ్యులు స్మశానంలో ధర్నా చేశారు. శశికళ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆరా తీశారు.

 భయంతో సరెండర్

భయంతో సరెండర్

శశికళ అనుమానాస్పద కేసులో తన పేరు ఉందని తెలుసుకున్న పురుషోత్తమన్ నేరుగా చెంగల్పట్టు జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేంద్రన్ దగ్గరకు వెళ్లి లొంగిపోయాడు. పురుషోత్తమన్ ను అదుపులోకి తీసుకున్న సెయ్యారు పోలీసులు అతన్ని మధురాంతకం నేర విభాగం కోర్టు న్యాయమూర్తి తిరుమాల్ ముందు హాజరుపరచడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతన్ని పరచి సెంట్రల్ జైలుకు తరలించారు.

 పార్టీ నుంచి ఔట్

పార్టీ నుంచి ఔట్

శశికళ కేసు విషయం తెలుసుకున్న డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే, స్టాలిన్ పురుషోత్తమన్, దేవేంద్రన్ లను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. శశికళ ఆత్మకు శాంతిచేకూరాలని స్టాలిన్ కోరుకున్నారు. డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు లీడర్స్ మీద లైంగిక వేధింపులు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారని కేసు నమోదు కావడంతో తమిళనాడులో కలకలం రేపింది.

English summary
DMK leader Blackmail: Chengalpattu lady Sasikala suicide case issue, and one surrendered in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X