• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పుట్టినరోజు నాడే పొట్టనబెట్టుకున్న కరోనా: డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత: స్టాలిన్‌కు కుడిభుజంగా

|

చెన్నై: తమిళనాడులో కరోనా కట్టలు తెంచుకుంది. వీర విజృంభణ చేస్తోంది. ప్రజలనే కాదు.. ప్రజా ప్రతినిధులను కూడా వదిలి పెట్టట్లేదు. కరోనా వైరస్ వల్ల తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకేకు చెందిన సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే జే అన్బళగన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. చెన్నైలోని రేలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. విషాదకరమేమిటంటే- బుధవారం ఆయన పుట్టినరోజు. అదే రోజు ఆయనను కరోనా వైరస్ పొట్టనబెట్టుకుంది.

అల్పపీడనం ఎడాపెడా: బంగాళాఖాతంలో మరొకటి: వాయుగుండంగా మారే ఛాన్స్?

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడిన కారణంగా కొద్దిరోజుల కిందట ఆయన రేలా ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయనను ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అదే సమయంలో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. చికిత్స కొనసాగుతున్న సమయంలోనే కిడ్నీ సమస్యలు తీవ్రం అయ్యాయి. దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టంగా మారినట్లు రేలా ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు.

DMK MLA J Anbazhagan Dies of Covid-19 in Chennai, coincides with his birthday

పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. గ్రేటర్ చెన్నై పరిధిలోని చెపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్బళగన్ విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు కుడిభుజంగా ఆయనకు పేరు ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను అన్బళగన్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా- ఒండ్రినైవొమ్ వా (మనమంతా ఏకమౌదాం) పేరుతో అన్ని వర్గాలను ఏకం చేయడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని డీఎంకే చేపట్టింది. దీనికి అన్బళగన్ నేతృత్వాన్ని వహిస్తున్నారు.

  #HappyBirthdayNBK: ఎలా మాట్లాడాలో తెలుసుకోరా ** కొడకా.. బాలయ్య డైలాగ్ ఆ రాజకీయ నాయకుడి గురించేనా

  అన్బళగన్ మరణం పట్ల ఎం కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. తన కుటుంబ సభ్యుడిని కోల్పోయానని వ్యాఖ్యానించారు. అన్బళగన్ డీఎంకే పార్టీ పట్ల, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పట్ల అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటును మిగిల్చిందని అన్నారు. దూరదృష్టితో వ్యవహరించగల సమర్థుడైన ప్రజా నేతను కోల్పోయామని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని విమర్శించారు.

  English summary
  DMK MLA J Anbazhagan died early on Wednesday morning of acute respiratory distress, the manifestation of the Covid-19 disease, nearly a week after he was admitted to a hospital. He was 61. Anbazhagan’s admission to hospital had kept anxious cadre from the opposition camp on their toes, many of whom were raising at every opportunity the lapses made by the E Palaniswami government in tackling the virus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X