వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? రగులుతున్న రాష్ట్రం

డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సచివాలయం నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారని తమిళ టీవీ చానల్స్ లో వార్తలు ప్రసారం కావడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు శశికళ.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు గాలివానలా మారుతున్నాయి. నిమిష నిమిషానికి అధికారంలో ఉన్న అన్నాడీఎం, ప్రతిపక్ష డీఎంకే పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా డీఎంకే ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశం నుంచి స్పీకర్ బహిష్కరించారు.

ఆరు మంది ఎమ్మెల్యేలు జారుకుంటే పళనిసామి ఔట్, పన్నీర్ కే !ఆరు మంది ఎమ్మెల్యేలు జారుకుంటే పళనిసామి ఔట్, పన్నీర్ కే !

డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను బయటకు పంపించడానికి మార్షల్స్ ప్రయత్నించడంతో ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సచివాలయంలోకి వెయ్యి మందికి పైగా పోలీసులు, అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు ప్రవేశించాయి.

DMK MLAs tear paper, throw chairs in the assembly

డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సచివాలయం నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారని తమిళ టీవీ చానల్స్ లో వార్తలు ప్రసారం కావడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

సీఎం పళనిసామి బలపరిక్షలో ఓడిపోతే తమిళనాడులో ఇదే పరిస్థితి !సీఎం పళనిసామి బలపరిక్షలో ఓడిపోతే తమిళనాడులో ఇదే పరిస్థితి !

శశికళ దిష్టిబోమ్మలు దహనం చేసి ధర్నాలు చేస్తున్నారు. మా జీవితాలతో చెలగాటం ఆడటానికి శశికళ వర్గం ఇలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అన్నాడీఎంకే పార్టీ, శశికళ, ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డీఎంకే నాయకులు సచివాలయం వైపు పరుగు తీశారు. అయితే సచివాలయం పరిసర ప్రాంతాల్లో రెండు కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పోలీసులు డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.

English summary
DMK MLAs tear paper, throw chairs in the assembly. Additional 1,000 police personnel deployed at secretariat in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X