వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వను అనర్హుడిని చెయ్యండి: మద్రాసు హైకోర్టుకు డీఎంకే, చట్టం అందరికీ ఒక్కటే !

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద 18 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే.

మేనత్త జయలలిత మరణంపై కోర్టును ఆశ్రయిస్తా: దీపా, సీబీతో విచారణ: స్టాలిన్ డిమాండ్ !మేనత్త జయలలిత మరణంపై కోర్టును ఆశ్రయిస్తా: దీపా, సీబీతో విచారణ: స్టాలిన్ డిమాండ్ !

ప్రభుత్వం, పార్టీ మీద తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 18 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. గత ఫిబ్రవరి నెలలో ఎడప్పాడి పళని సామి శాసన సభలో బలపరీక్ష నిర్వహించారు.

DMK moves Madras High Court disqualify Panneerselvam and others

ఆ సమయంలో పన్నీర్ సెల్వంతో సహ 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేశారని, స్పీకర్ ధనపాల్ అప్పుడు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని డీఎంకే పార్టి నాయకుడు ఆర్. చక్రపాణి చెప్పారు.

జయలలితకు చికిత్స: వీడియో, ఫోటోలు ఉన్నాయి, విచారణ కమిటీకి ఇస్తాం: మన్నార్ గుడి !జయలలితకు చికిత్స: వీడియో, ఫోటోలు ఉన్నాయి, విచారణ కమిటీకి ఇస్తాం: మన్నార్ గుడి !

పన్నీర్ సెల్వంకు ఒక చట్టం, 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఒక చట్టమా అని స్పీకర్ ను ప్రశ్నించాలని మద్రాసు హైకోర్టుకు మనవి చేశామని ఆర్. చక్రపాణి వివరించారు. మద్రాసు హైకోర్టు బుధవారం పిటిషన్ విచారణ చేసే అవకాశం ఉందని డీఎంకే పార్టీ నాయకుడు ఆర్, చక్రపాణి చెప్పారు.

మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ ఇంటి పోరు విషయంలో ఇప్పుడు డీఎంకే పార్టీ కోర్టుకు వెళ్లడంతో పన్నీర్ సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేల విషయంలో మద్రాసు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
DMK on Monday filed a case in the Madras high court, seeking to disqualify deputy chief minister O Panneerselvam and 11 other MLAs. In his petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X