• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శశికళ అత్యాచారం కేసు: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్, రాజకీయ ఒత్తిళ్లతో కొత్త ట్విస్ట్..!

|

చెన్నై/ చెంగల్పట్టు: యువతి స్నానం చేస్తున్న సమయంలో సమీప బంధువులు, ఓ పొలిటికల్ లీడర్ కలిసి మొబైల్ లో ఆమె నగ్న వీడియోలు తీసి ఐదు సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేశారు. బంధువుల లైంగిక వేధింపులు తట్టుకోలేక శశికళ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆ యువ పొలికల్ లీడర్ పోలీసుల ముందు లొంగిపోయాడు.

సొంత బంధువులే నగ్న వీడియోలు తీసి టార్చర్ చేసి ఆమెపై లైంగిక దాడి చేసి చంపేశారని, నిందితులకు కఠిన శిక్షపడేలా ఆదేశాలు జారీ చెయ్యాలని మనవి చేస్తూ శశికళ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని శశికళ తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి మనవి చేశారు. శశికళ ఆత్మహత్య కేసు తమిళనాడులో కలకలం రేపింది.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు!

హ్యాపీగా శశికళ లైఫ్

హ్యాపీగా శశికళ లైఫ్

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా సెయ్యారు పట్టణంలోని నైనార్ కుప్పంలో నివాసం ఉంటున్న శశికళ (25) అనే యువతి చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న శశికళకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ కారణంగా శశికళ సెయ్యారుకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది.

పొలిటికల్ లీడర్ కాదు.....శాడిస్టు

పొలిటికల్ లీడర్ కాదు.....శాడిస్టు

శశికళ సమీప బంధువులు అయిన పురుషోత్తమన్ (25), దేవేంద్రన్ (27) అనే ఇద్దరు యువకులు డీఎంకే పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. పురుషోత్తమన్ చెంగల్పట్టు జిల్లా కార్యనిర్వహణ విభాగం నాయకుడిగా, దేవేంద్ర అదే పార్టీ లోకల్ లీడర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే పురుషోత్తమన్, దేవేంద్రల మీద హత్య కేసు నమోదు కావడంతో ఆ కేసు విచారణలో ఉంది. పురుషోత్తమన్ రాజకీయాల్లో ఉన్నా అతని నడవడికలు, రౌడీలతో స్నేహాలు చేస్తున్నాడని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

ఐదేళ్లుగా శశికళకు నరకం

ఐదేళ్లుగా శశికళకు నరకం

ఐదు సంవత్సరాల క్రితం శశికళ ఇంట్లో స్నానం చేస్తున్న సమయంలో పురుషోత్తమన్, అతని బంధువు దేవేంద్రన్ తదితరులు రహస్యంగా మొబైల్ లో వీడియోలు తీశారు. తరువాత ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని పురుషోత్తమన్ తదితరులు అనేకసార్లు శశికళను బెదిరించి ఆమెపై లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలు బయటకు చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామని డీఎంకే పార్టీ నేత పురుషోత్తమన్, దేవేంద్రన్ తదితరులు శశికళను బెదిరించారని తెలిసింది. రాజకీయంగా పలుకుబడి ఉండటంతో శశికళ ఇంతకాలం మౌనంగా ఉండిపోయింది.

ప్రాణం తీసిన లాక్ డౌన్

ప్రాణం తీసిన లాక్ డౌన్

లాక్ డౌన్ సందర్బంగా ఇంట్లోనే ఉంటున్న శశికళకు కామంధులు మరింత ఎక్కువ టార్చర్ పెట్టారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు మా కామం తీర్చాలని శశికళను తీవ్రవేధింపులకు గురి చేశారు. నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని టార్చర్ పెట్టడంతో తట్టుకోలేని శశికళ జూన్ 24వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మొదట కేసు నమోదైయ్యింది. పురుషోత్తమన్, దేవేంద్రన్ తదితరుల లైంగిక వేధింపుల కారణంగానే శశికళ ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్న అరుణ్ బాబు సెయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రీ పోస్టుమార్టుం చెయ్యాలి

రీ పోస్టుమార్టుం చెయ్యాలి

శశికళ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషోత్తమన్ ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయాడు. పురుషోత్తమన్, దేవేంద్రన్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. శశికళ ఆత్మహత్య చేసుకుందని వైద్యులు నివేదిక ఇచ్చారు. అయితే అత్యాచారం, లైంగికదాడి చేసి రేప్ చెయ్యడం వలనే శశికళ మరణించిందని, ఆమె హత్యకు గురైయ్యిందని, మళ్లీ రీ పోస్టుమార్టుం చెయ్యాలని ఆమె కుటంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సీబీఐ విచారణ చెయ్యాలి

సీబీఐ విచారణ చెయ్యాలి

శశికళ ఆత్మహత్య కేసు తమిళనాడులో కలకలం రేపింది. నిందితులు డీఎంకే పార్టీ నాయకులని ( పార్టీ సస్పెండ్ చేసింది), ఆ పార్టీతో పాటు అధికార అన్నాడీఎంకే పార్టీ నేతలు సైతం వారికి అండగా ఉన్నారని శశికళ తల్లి చంద్రమ్మన్ ఆరోపిస్తున్నారు. స్థానిక సెయ్యారు పోలీసు మీద తమకు నమ్మకం లేదని, కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని శశికళ కుటుంబ సభ్యులు మద్రాసు హైకోర్టులో అర్జీ సమర్పించారు. శశికళపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మద్రాసు హైకోర్టు మాకు న్యాయం చేస్తోందని, నిందితులకు కఠిన శిక్ష పడుతుందని తాము భావిస్తున్నామని శశికళ కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
DMK person arrested: Tamil Nadu Chengalpattu sasikala suicide case issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X