• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెన్నైలో నీటి కోసం అల్లాడుతున్న జనం..! తేలిగ్గా తీసుకుంటుంన్న పళని ప్రభుత్వం..!!

|
  నీటి కోసం అల్లాడుతున్న తమిళ తంబీలు..!! ||Water Problem In Chennai Went Upto Lok Sabha || Oneindia

  తమిళనాడు/హైదరాబాద్ : తమిళ నాడులో విచిత్ర సంక్షోభం రాజకీయ పార్టీలను కుదిపేసే స్థాయికి చేరుకుంది. తమిళనాడు రాష్ట్రానికి మూడుపక్కల సముద్రం ఉన్నా తాగడానికి చుక్క నీరు లేక జనాలు అల్లాడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొన్నటి వరకూ బహుళార్ధక సంస్థలు నీళ్లులేక సెలవులు ప్రకటించగా ఇప్పుడు పట్టణ ప్రాంత వాసులకు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో ఉన్న నీటి ఎద్దడి తీవ్రతను ఎడప్పాడి ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటు సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకవడం పట్ల నిరసన తెలుపుతున్నారు. కోయంబత్తూర్ లో నెలకొన్న సీటి ఎద్దడి పట్ల ప్రభుత్వం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

   తమిళనాడులో నీళ్లకోసం కటకట..! అల్లాడుతున్న తంబీలు..!!

  తమిళనాడులో నీళ్లకోసం కటకట..! అల్లాడుతున్న తంబీలు..!!

  చెన్నైలో తాగునీటి కషాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నీటి ఎద్దడికి ప్రజలు అల్లాడుతున్నారు. అరకొర ట్యాంకర్లు వస్తున్నా.. ప్రజల దాహర్తి తీర్చేందుకు ఏమాత్రం సరిపోవడం లేదు. సమస్య తీవ్రంగా ఉండడంతో స్కూళ్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఐటీ సంస్థల్లో అయితే నీటి కొరత ఏర్పడింది. దీంతో ఉద్యోగులను ఇంటి నుంచే వర్క్ చేయాల్సిందిగా ‘వర్క్ ఫ్రం హోం' సంస్థలు కోరుతున్నాయి. చెన్నైలోని రాంనగర్‌లో నివసిస్తున్న వారికి కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

   కొన్ని రోజుల క్రితం సాఫ్ట్ వేర్ సంస్థలకు సెలవులు..!వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలిచ్చిన యాజమాన్యాలు..!!

  కొన్ని రోజుల క్రితం సాఫ్ట్ వేర్ సంస్థలకు సెలవులు..!వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలిచ్చిన యాజమాన్యాలు..!!

  ట్యాంకర్లు కూడా సరిగా రావడంలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ట్యాంకర్ ఏప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, తాము ఉద్యోగాలకు వెళ్లివచ్చేలోగా ట్యాంకర్ వచ్చి వెళ్లిపోతే ఇక తమకు నీళ్లు ఉండవని చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాంనగర్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మున్సిపాలిటీ నీళ్లు కూడా తమకు సరిగా రావని, చుట్టుపక్కలకు వస్తాయని, తమ ప్రాంతానికి రావని, పైపు లైన్లు సరిగా లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు వాపోయారు.

   జలం కోసం నిరసన గళం..! ఖాళీ బిందెలతో బైఠాయిస్తున్న స్థానికులు..!!

  జలం కోసం నిరసన గళం..! ఖాళీ బిందెలతో బైఠాయిస్తున్న స్థానికులు..!!

  తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై డీఎంకే ఆందోళన బాటపట్టింది. చెన్నైలో సోమవారం డీఎంకే ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చపాక్‌ స్టేడియం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎంకే శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో పాలక ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డీఎంకే నేతలు పాలక పార్టీపై విరుచుకుపడ్డారు. చెన్నైలో నగర ప్రజలతో పాటు ఐటీ కంపెనీలు, వివిధ పరిశ్రమలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

   లోక్ సభకు పాకిని నీటి సమస్య..! త్వరలో సమస్య పరిష్కారం అవుతుందంటున్న ప్రభుత్వం..!!

  లోక్ సభకు పాకిని నీటి సమస్య..! త్వరలో సమస్య పరిష్కారం అవుతుందంటున్న ప్రభుత్వం..!!

  మరోవైపు తమిళనాడులో నీటి ఎద్దడిపై డీఎంకే సభ్యుడు టీఆర్‌ బాలు లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. కాగా చెన్నైలో నీటి సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. జోలార్‌పేట్‌ నుం‍చి రైళ్ల ద్వారా రోజుకు 10 మిలియన్‌ లీటర్ల నీటిని ప్రభుత్వం తీసుకువస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి ఇప్పటికే ప్రకటించారు. కాగా చెన్నైలో తీవ్ర నీటికొరత నెలకొనడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరిన సంగతి తెలిసిందే.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Water problem In Chennai went upto lok sabha. Chief Minister Palani Swamy responded to the water problem in Chennai. Palaniswamy said the water shortage in Chennai caused the ground water to recede. However, it was not a big problem as it was shown in the media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more