వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకేకి చేతకాదు: తమిళనాడులో ఆందోళనకు దిగిన డీఎంకే

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ చేతకానితనం వలనే జల్లికట్టు సాహస క్రీడ నిర్వహించుకోలేని పరిస్థితి ఎదురైయ్యిందని ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ఎంకే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ చేతకానితనం వలనే జల్లికట్టు నిర్వహించుకోలేని పరిస్థితి ఎదురైయ్యిందని ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు.

జల్లికట్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెయ్యాలని డీఎంకే పార్టీ కార్యకర్తలకు ఎంకే. స్టాలిన్ గురువారం పిలుపునిచ్చారు. జల్లికట్టు నిర్వహణపై శనివారం లోగా తీర్పు వెలువరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెయ్యాలని డీఎంకే పార్టీ నిర్ణయం తీసుకునింది.

DMK today announced statewide protest in Tamil Nadu

జల్లికట్టుపై త్వరగా తీర్పు ఇవ్వాలని తమిళనాడుకు చెందిన కొందరు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. అయితే తీర్పు విషయంలో ఇలా కోరడం భావ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

తమకు తీర్పు ఎప్పుడివ్వాలో తెలుసని, ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సంక్రాంతి పండగ సమీపించడంతో జల్లికట్టు నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్న తమిళ సోదరులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు.

సంక్రాంతి పండగ సందర్బంగా తమిళనాడులో పెద్ద ఎత్తున జల్లికట్టు సాహస క్రీడ నిర్వహించడం అనవాయితీ. మొత్తం మీద తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ జల్లికట్టు విషయంలోఒక్కటై అధికార పార్టీ చేతకానితనం వలనే జల్లికట్టు నిర్వహణకు అడ్డంకులు ఏర్పాడ్డాయని ఆరోపిస్తు ఆందోళనకు దిగారు.

English summary
DMK today announced statewide protest in Tamil Nadu over Jallikattu ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X