వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో స్టాలిన్ అండ్ కో గొడవ ఎందుకంటే, అసలు విషయం ఇదే !

ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటున్న శశికళ వర్గంలోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎలాగైనా డిస్మిస్ చేయించాలని డీఎంకే పార్టీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే బలపరీక్ష సందర్బంగా రహస్య ఓటింగ్.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో డీఎంకే పార్టీ చాకచక్యంగా పావులుకదుపుతోంది. శనివారం అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు చేసిన రాద్దాంతానికి ఓ కారణం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. శశికళ వర్గం మీద మొదటి నుంచి స్టాలిన్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?

అయితే శనివారం తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వ బలపరిక్షను అడ్డుకోవడానికి డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుపడుతూనే వచ్చారు. అందుకు ఓ బలమైన కారణం ఉందని డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు

DMK wants AIADMK gvt to be dismissed, says sources

తమిళనాడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైన డిస్మిస్ చేయించాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే శాసన సభసమావేశంలో డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారని సమాచారం.

40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరంటే: రంగంలోకి పన్నీర్ !40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరంటే: రంగంలోకి పన్నీర్ !

ఎలాగైనా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయించాలని డీఎంకే పార్టీ ప్రయత్నిస్తోందని సమాచారం. అందులో భాగంగానే బలపరీక్ష సందర్బంగా రహస్య ఓటింగ్ జరిపించాలని డీఎంకే పట్టుబడుతుంది.

రహస్య ఓటింగ్ లో శశికళ వర్గంలోని ఆరు మంది ఎమ్మెల్యేలు పళనిసామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేస్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని డీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు. వీలైనంత వరకు ఓటింగ్ ను అడ్డుకోవడమే డీఎంకే ధ్యేయం అని సమాచారం.

English summary
DMK wants AIADMK gvt to be dismissed, says sources. Assembly fighting is one of the reason for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X