చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీఎంకే అధినేతగా స్టాలిన్‌ను అంగీకరిస్తా, కానీ: అళగిరి డిమాండ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత డీఎంకే నేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి యూటర్న్ తీసుకున్నారు. తనను తిరిగి పార్టీలోకి తీసుకుంటే తన సోదరుడు స్టాలిన్‌ను డీఎంకే పార్టీ అధినేతగా అంగీకరిస్తానని ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి అన్నారు.

ఇటీవల ఆ పార్టీలో ఆధిపత్య పోరు మొదలయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే డీఎంకే అధినేతగా స్టాలిన్‌ ఎన్నికయ్యారు. అయితే, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారంటూ పలుసార్లు హెచ్చరించిన అళగిరి గురవారం మాత్రం వెనక్కితగ్గారు.

DMK war: Alagiri makes a U turn, says ready to accept MK Stalin as his leader

'సెప్టెంబరు 5న నేను చేపట్టనున్న ర్యాలీ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడానికి మేము అధికార పార్టీ (ఏఐఏడీఎంకే) నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు. నన్ను పార్టీలోకి తీసుకుంటే మాత్రం డీఎంకే అధినేతగా స్టాలిన్ వ్యవహరించడాన్ని ఒప్పుకుంటాను' అని అళగిరి వ్యాఖ్యానించారు.

కాగా, అళగిరిని 2014లో డీఎంకే నుంచి బహిష్కరించారు. ఇటీవల కరుణానిధి మృతి చెందడంతో డీఎంకే అధినేత బాధ్యతలను స్టాలిన్‌ చేపట్టారు. అయితే, తనను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని అళగిరి కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధినేతగా స్టాలిన్‌ ఉండడాన్ని తాను ఒప్పుకోనని ఇటీవల అన్నారు. కానీ, ఇప్పుడు మాటమార్చడంతో డీఎంకే శ్రేణుల్లోనూ కొంత సానుకూలత ఏర్పడుతోంది.

English summary
Expelled DMK leader and former Union minister M K Alagiri on Thursday said he is ready to accept party president MK Stalin as his leader if the party takes him back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X