చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెఎన్‌యూ విద్యార్థులకు అండగా తమిళ హీరో: వారితో కలిసి ఢిల్లీలో నిరసన దీక్షలో.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యూ) విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేయడానికి నిరసనగా కొద్దిరోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు, దీక్షల్లో ప్రముఖ తమిళ నటుడు ఎంకే ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. విద్యార్థులతో కలిసి తానూ దీక్ష శిబిరంలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులుె ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడాన్ని తప్పు పట్టారు.

TDP: పోలీసుల దిగ్బంధంలో టీడీపీ కేంద్ర కార్యాలయం: మంగళగిరిలో ఉద్రిక్తత: బైక్ ర్యాలీ..!TDP: పోలీసుల దిగ్బంధంలో టీడీపీ కేంద్ర కార్యాలయం: మంగళగిరిలో ఉద్రిక్తత: బైక్ ర్యాలీ..!

ఉదయనిధి స్టాలిన్..ఓకే ఓకే వంటి కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచిరితుడే. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. అటు రాజకీయాలు, ఇటు సినిమాలను సమాంతరంగా నెట్టుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం- సైకో.. త్వరలోనే విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో తాజాగా ఉదయనిధి తన దృష్టిని రాజకీయాల వైపు మళ్లించారు.

DMK youth wing leader Tamil actor Udhayanidhi Stalin met and interacted with students in JNU

ఈ ఉదయం ఆయన చెన్నై నుంచి బయలుదేరి, ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థులను కలిశారు. ఈ నెల 5వ తేదీన క్యాంపస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసుకున్న తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, పోలీసులను నిరసనగా నినాదాలు చేశారు.

DMK youth wing leader Tamil actor Udhayanidhi Stalin met and interacted with students in JNU

ముఖానికి ముసుగులు వేసుకుని క్యాంపస్‌లొ చొరబడి విద్యార్థులపై దాడికి దిగిన వారిని ఢిల్లీ పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత బలాన్ని ఇస్తోందని అన్నారు. నిందితులెవరో సీసీటీవీ ఫుటేజీల్లో తేలినప్పటికీ.. అరెస్టు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు.

English summary
Delhi: DMK youth wing leader and son of MK Stalin, Udhayanidhi Stalin and other party leaders met and interacted with students in Jawaharlal Nehru University over January 5 violence in the campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X